• ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు నీటి పరీక్షలు
నిజాంపేట: నేటి ధాత్రి
వేసవికాలం సమీపిస్తున్న నేపథ్యంలో నీటిని వృధా చేయవద్దని మిషన్ భగీరథ అధికారులు సూచించారు. ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో ఉదయం మిషన్ భగీరథ అధికారులు ఇంటింటికి వెళ్లి నీటి నమూనాలను సేకరించి క్లోరోస్కోప్ అనే పరికరం తో పరీక్షించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మిషన్ భగీరథ ఏఈ ఆదేశాల మేరకు మంచినీటి ట్యాంకులను శుభ్రం చేసి ప్రజలకు నీటిని అందించడం జరుగుతుందన్నారు. బ్లీచింగ్ పౌడర్ ట్యాంక్ కెపాసిటీ 10 వేలు ఉంటే 40 గ్రాములు కలపడం జరుగుతుందన్నారు. ట్యాంక్ నుండి నీటిని విడుదల చేసే 30 నిమిషాల ముందు పౌడర్ ను కలపడం జరుగుతుందన్నారు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి మంచి నీటిని అందించడమే ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు పరశురాములు, నర్సింలు ఉన్నారు.