`పడిపోయిన పవన్ ర్యాంకు!
`ఆర్భాటమెక్కువ..ఆచరణ తక్కువ!
`ఆవేశమెక్కువ..ఆలోచన తక్కువ
`పవన్‌తో మేలు కన్నా, నష్టమే ఎక్కువ?
`కొంత మంది మంత్రుల కన్నా తగ్గిన పని పవన్ పనితనం
`రాజకీయం వేరు..పరిపాలన వేరు
`రోజూ రాజకీయాలే చేస్తామంటే జనం ఒప్పుకోరు
`పవన్ దూకుడులో ఇప్పటికీ నోటి దురుసు
`రాజ్యాంగ బద్దమైన పదవిలో వుంటూ అడ్డగోలు వ్యాఖ్యలు
`ప్రభుత్వానికి మైలేజ్ తేకపోగా డ్యామేజ్ అవుతోంది
`పదే పదే డబ్బులు లేవంటూ పవన్ మాటలు ప్రభుత్వానికి ఇబ్బందికరం
`సాటి మంత్రులు ఇరుకున పడేలా పవన్ వ్యాఖ్యలు
`మొదటి సారి ర్యాంకుతో రెచ్చిపోయిన పవన్
`పదో ర్యాంకుతో అంతా సైలెన్స్
`దూకుడు ఎన్నికలలో మేలు చేసింది
`ఎల్లకాలం పని చేయదని పవన్‌కు తెలిస్తేనే మంచిది
హైదరాబాద్,నేటిధాత్రి:
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పాత్రపై రకరకాల సందేహాలు, అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఇటీవల కాలంలో పవన్ తన పంథాను మార్చుకొని తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారన్న సంగతి స్పష్టంగా కనిపిస్తోందంటున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ రాజకీయాన్ని ఆది నుంచి గమనిస్తే, మొదట్లో ఆయన చెప్పిన మాటలకు, ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలకు ఎక్కడా పొంతనవుండదు. ఎప్పటికప్పుడు తన మార్గం మార్చుకోవడంలో పవన్ కళ్యాన్‌ను మించిన నాయకుడు లేడని చెప్పొచ్చు. పవన్ కళ్యాన్ రాజకీయం మొదలు పెట్టినప్పుడు చెగువేరా సిద్దాంతం అన్నాడు. తిరుగుబాటు విధానంతో ముందుకు సాగాడు. తన అభిమానులంతా చెగువేరా టీషర్టులు వేసుకునేదాకా వచ్చింది. మోటార్ సైకిళ్లు,కార్లమీద చెగువేరా బొమ్మతోపాటు పవన్ ఫోటోలు పెట్టుకున్నారు. ఇదే సమయంలో తనలో కమ్యూనిజం బావాలున్నాయన్నారు. గద్దర్ పాటలంటే తాను చెవికోసుకుంటానన్నారు. గద్దర్ లాంటి వారి బావజాలంతో తాను చైతన్యం పొందానన్నారు. పవన్ కల్యాణ్ తండ్రి ఓసారి నెల్లూరు గద్దర్ వచ్చినప్పుడు వెళ్లి ఆయన పాటలు వినమని చెప్పారని కూడా చెప్పుకున్నారు. అలా సాగినంత కాలం పవన్ కళ్యాన్ రాజకీయం ముందుకు సాగలేదు. దాంతో ఆయన తన రాజకీయ పంధాను మార్చుకున్నారు. ఒక్కసారిగా బిజేపికి దగ్గరయ్యారు. 2014 ఎన్నికల్లో బిజేపితో పొత్తు పెట్టుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీ, బిజేపి, జనసేన మూడు పార్టీలు కలిసి విజయంసాదించాయి. కాని ఆ ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. కాని కూటమికి మద్దతు పలికి ఆనాడు తెలుగుదేశం పార్టీ విజయానికి దోహదరపడ్డారు. కాకపోతే అతి కొద్ది రోజుల్లోనే ఆయన తన మద్దతుతోనే తెలుగుదేశం గెలిచిందని అంటూ వచ్చారు. కొద్దికాలానికి బిజేపితో కూడా తెగదెంపులు చేసుకున్నారు. రాష్ట్ర భవిష్యత్తును బిజేపి నాశనం చేసిందంటూ విమర్శలు చేశారు. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి, ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి మోసం చేశారని ఎలుగెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక సభలు నిర్వహించారు. తనపార్టీ బలోపేతం కోసం ప్రయత్నం చేసుకున్నారు. కాని అటు సినిమాలు, ఇటు పార్టీ రెండిరటినీ ఏక కాలంలో మేనేజ్ చేయలేకపోయారు. పార్టీని పటిష్టం చేయలేకపోయారు. కాని పవన్ ఎక్కడికి వెళ్లినా జనం తండోపతండాలుగా వచ్చారు. దాంతో 2019 ఎన్నికల్లో పవన్ ఒంటరిగా పోటీ చేశారు. స్వయంగా ఆయన రెండు చోట్ల పోటీ చేశారు. కాని ఆయన గెలవలేదు. పార్టీ మాత్రం ఒక్కటే సీటు గెలిచింది. దాంతో పవన్‌కు జ్ఞానోదయమైంది. ఇప్పుడున్న రాజకీయ పరిస్దితులకు తిరుగుబాటు సిద్దాంతం కరక్టు కాదని తెలుసుకున్నాడు. దేశ వ్యాప్తంగా బిజేపికి పెరుగుతున్న ఆదరణ చూసి తన పంథాను అటు వైపు మల్చుకున్నారు. సనాతన ధర్మంలో గొప్ప దనం గుర్తించారు. అటు వైపు అడుగులేశారు. వైసిపిని బిజేపికి దూరం చేయగలిగారు. తర్వాత కొంత కాలానికి తెలుగుదేశాన్ని బిజేపితో కలిపి, మళ్లీ తన రాజకీయం మొదలు పెట్టారు. తన ప్రాదాన్యత పెంచుకుంటూ వచ్చారు. జనంలో ఆకాంక్షల కన్నా, రాజకీయంలో సరికొత్త ఆలోచనలకు పదునుపెట్టారు. ఎన్నికల్లో గెలవడమే రాజకీయం అనుకున్నారు. సిద్దాంతాలను నమ్ముకుంటే సీట్లు రావని తెలుసుకొని పొత్తుతో పోతే తప్ప జనసేన గెలవలేదని గ్రహించి తెలుగుదేశం పార్టీకి గొడుగు పట్టుకున్నారు. మళ్లీ 2014 నాటి రోజులను ఆవిష్కరించారు. కాకపోతే ఆయన ఎంచుకున్న దారిని మార్చుకున్నారే గాని, తనలోని ఆశలకు రెక్కలు తొగడం మాత్రం వాయిదా వేసుకోలేదు. వేసుకునేందుకు సిద్దంగా లేరు. నిజం చెప్పాలంటే లక్ష్యం లేకుండా ఏ నాయకుడు రాజకీయాలు చేయలేడు. అధికారం సాధించాలన్న కోరిక లేకుండా ఏ నాయకుడు రాజకీయ పార్టీని నడపలేడు. ఇప్పుడు పవన్ చేస్తున్నది అదే. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తన రాజకీయాన్ని విస్తరించాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఇక వేళ తాను ఆదమరిచి వున్న సమయంలో ఎక్కడ లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేస్తారో అన్న భయం పవన్‌లో పట్టుకున్నది. తన స్దానంలో మార్పు వస్తుందేమో అన్న ఆలోచన మొదలైంది. చంద్రబాబు నాయకత్వంలో ఇంకా పదిహేనేళ్లయినా పనిచేస్తానని అన్నారు. అంటే చంద్రబాబు నాయకుడుగా వుండే పాలనలోనే తాను వుంటానని స్పష్టం చేసినట్లైంది. కాని లోకేష్ నాయకత్వం, తనపై పెత్తనాన్ని అంగీకరించని పవన్ సూటిగానే చెప్పినట్లైంది. అసలు పవన్ అసలైన స్వరూపం అదే. అందులో తప్పులేదు. పొత్తు దర్మం కుదుర్చుకున్నది చంద్రబాబు కోసమే కాని, లోకేష్ కోసం కాదు. అందువల్ల పవన్ ఆలోచన తప్పు కాదు. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తప్పు పట్టాల్సిన పనిలేదు. కాని లోకేష్‌కు ప్రమోషన్‌ను అడ్డుకునే హక్కు పవన్‌కులేదు. లోకేష్ పార్టీ వేరు. పవన్ పార్టీ వేరు. తెలుగుదేశం పార్టీకి ఏపిలో సంపూర్ణమైన మెజార్టీ వుంది. పవన్‌కు ప్రతిపక్ష హోదాకు అవరమైన సీట్లు మాత్రమే వున్నాయి. అంతకు మించి సీట్లు లేవు. అయినా ఆయన కూటమి అధికారంలోకి వచ్చినప్పుడే తన మనసులోని మాట చెప్పేశారు. జనసేన చూపించిన దారిలో కూటమి ప్రయాణం సాగని పక్షంలో ప్రతిపక్ష పాత్ర కూడా మనమే పోషిస్తామని ముందే చెప్పేశారు. దాన్ని గత కొంత కాలంగా అనుసరిస్తూనే వస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తొలి రోజుల్లోనే తిరుమల తిరుపతిలో లడ్డూ వివాదాన్ని పూర్తిగా తన భుజాల మీద మోసి, క్రెడిట్ కొట్టేయాలనుకున్నాడు. నానా యాగీచేశారు. తిరుమలలో అపవిత్రం జరిగిపోయిందని గత ప్రభుత్వం చేసిన నిర్వాకం మూలంగా సనాతన దర్మానికి విఘాతం కల్గిందని అగ్రహోదగ్రుడయ్యాడు. కాని అదే సమయంలో చంద్రాబాబుగాని, లోకేష్ గాని తమ పని తాను చేసుకుంటూపోయారు. ఎందుకుంటే అది అటు తిరిగి, ఇటు తిరిగి ఎటు వెళ్తుందో చెప్పలేమని ముందే చంద్రబాబు అంచనా వేశారు. కాని పవన్ కళ్యాణ్ అంత దూరం ఆలోచించలేదు. ఎందుకంటే సహజంగా ఆయనకు ఆవేశం ఎక్కువ. ఆలోచన తక్కువ. క్రెడిట్ అంతా తన ఖాతాలో వేసుకుందామనుకుంటే కుదరలేదు. సుప్రింకోర్టు ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద సమాదానం లేకపోవడంతో, భక్తుల మనోభావాలు దెబ్బతీయొద్దని చెప్పడంతో పవన్ దూకుడుకు కళ్లెం వేసినట్లైంది. తర్వాత రాష్ట్రంలో కూటమి పాలన సాగుతున్నా వైసిపీ నాయకుల ఆగడాలు ఆగడం లేదంటూ హోంశాఖ మంత్రి పనితీరును ప్రశ్నించారు. తాను హోం మంత్రిని అయి వుంటే పరిస్ధితి మరో రకంగా వుండేదంటూ కొత్త బాష్యాలు చెప్పారు. అయినా తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్ధుకుపోయారు. కొత్తలో ఇలాగే వుంటుంది లే అనుకున్నారు. ఇక కాకినాడ పోర్టు విషయంలో షిప్‌ద సీజ్ అన్నది కొంత కాలం బాగా ట్రెండిరగ్ అయ్యింది. ఎందుకంటే మన దేశం నుంచి ఇతర దేశాలకు బియ్యం రవాణ వాణిజ్యం అనేది సర్వసాదారణం. అందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతులు కూడా వుంటాయి. అయితే ఆ షిప్‌లలో డ్రగ్స్ సరఫరా అవుతున్నాయేమో అని అనుమానం వ్యక్తం చేశారు. దాంతో విచారణ కూడా జరిపించారు. సముద్ర వ్యాపారమంతా కేంద్ర ప్రభుత్వం చేతిలో వుంటుంది. అవసరమైతే డిల్లీకి వెళ్లి నేను మాట్లాడతా? అన్నారు. వెళ్లారు. అసలు విషయం తెలుసుకొని సైలెంట్ అయ్యారు. తన మంత్రిత్వ శాఖలో పనులు వదిలేసి, ఇతర మంతిత్వ శాఖలలో వేలు పెట్టుడం మొదలు పెట్టారు. తన శాఖ ఫైళ్ల క్రియరెన్స్ పక్కనపెట్టారు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన ర్యాంకుల్లో పదో ర్యాంకుతో సరిపెట్టుకున్నారు. మొదటిసారి ర్యాంకు మొదటిర్యాంకును సాధించిన పవన్ ఇప్పుడు పదో ర్యాంకు తెచ్చుకున్నారు. దీనంతటికీ ఈ మధ్య ఆయన పరిపాలన మీద దృష్టి పెట్టకుండా రాజకీయాల మీద కేంద్రీకృతం చేస్తున్నారనేది అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే లోకేష్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని తెలుగుదేశం శ్రేణుల నుంచి డిమాండ్ మొదలైందో అప్పటి నుంచే పవన్ తన పంధాకు మరింత పదును పెట్టారు. తనకు తానుగానే ప్రత్యేకతను సంతరించుకునేలారాజకీయం చేయాలనుకున్నాడు. లోకేష్ మూలంగా కాలం కలిసొసొచ్చేలా వుందని అనుకుంటున్నాడు. లోకేష్‌కు ప్రమోషన్ ఇవ్వడాన్ని సాకుగా చూపి పక్కకు తప్పుకోవాలన్నదే పవన్ ఆలోచన. అదే సమయంలో ప్రభుత్వం మీద విమర్శలు చేసి, లక్కి బాస్కర్ సినిమాలో బాస్కర్ తప్పుకొని సానుభూతిని పొందినట్లు పొందాలని చూస్తున్నారు. ఇదే పవన్ నయా రాజకీయం. ఎప్పుడైనా ఆయన వేరు కుంపటి ఖాయం. అందువల్ల ముందే తెలుగుదేశం తేరుకోవడం అవసరం.