చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో:06.02.2025 రోజు రాత్రి 10.00 గం//ల సమయమున చిట్యాల పెట్రోల్ బంక్ నందు పనిచేయు చెవుల శ్రీనివాస్ రావు, తండ్రి ఏడుకొండలు, వయస్సు 24 సంవత్సరాలు నివాసం మాచవరం గ్రామం, పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ అనునతడు తన పని నిమిత్తం చిట్యాల సెంటర్ కు మోటార్ సైకిల్ ఫై వెళ్లి తిరిగి బంకు వైపు వస్తుండగా మార్గమధ్యన ఏ మ్మెల్యే క్యాంపు ఆఫీస్ వద్దకు రాగానే తాను నడిపే మోటార్ సైకిల్ స్కిడ్ అయి క్రిందపడగా తలకు మరియు ఇతర చోట్ల బలమైన రక్తగాయాలు అయి అక్కడిక్కడే చనిపోయిన్నాడని తన చిన్నమ్మ చెవుల ఝాన్సీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రవణ్ కుమార్ కుమార్ తెలిపారు.