మరిపెడ:నేటిధాత్రి.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోనీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం (రామాలయం బంగ్లా)లో ఎన్నుకోబడిన నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం శుక్రవారం ఉదయం ఆలయంలో జరిగింది.ఆలయ శాశ్వత ఛైర్మన్,ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాంరెడ్డి,
వైస్ చైర్మన్ నూకల ఆభినవ్ రెడ్డి,ఇన్చార్జి గంట్ల రంగారెడ్డి, కార్యదర్శి మరియు కోశాధికారి ఉల్లి శ్రీనివాస రావు,కమిటీ సభ్యులు ఉప్పల నాగేశ్వర్ రావు,వెంపటి, వెంకటేశ్వర్లు, బోనగిరి సత్యనారాయణ,వెంపటి. కృష్ణమూర్తి,మచ్చా వెంకట నర్సయ్య,బోడ రూపా నాయక్ ,వెరమరెడ్డి నర్సింహారెడ్డి,తల్లాడ మురళి,
ఉప్పల కృష్ణ మూర్తి, కొంపెల్లి. వేణుగాపాల్ రెడ్డి, గుండగాని బాబురావు, గూడూరు నాగేశ్వర్ రావు,వుల్లి విద్యారాణి, బూరుగు దిలీప్ కుమార్ చే ఆలయ అర్చకులు సుదర్శన్ బట్టర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి స్నేహ యూత్ అధ్యక్షులు నూకల అభినవ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. రామసహాయం సురేందర్ రెడ్డి నిర్ణయం మేరకు కమిటీని ప్రకటించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైనా కమిటీ సభ్యులు హైందవ ధర్మాన్ని కాపాడుతూ ఆలయ అభివృద్ధికి పాటుపడతామనీ తెలిపారు