ఆలయ భూములు దాదాపు 300 ఎకరాల వరకు ఉంటుంది
ఐదు ఎకరాల భూమిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం- చైర్మన్ రామ్ రెడ్డి
నిజాంపేట, నేటి ధాత్రి
మెదక్ జిల్లాకు కేంద్రీయ విశ్వవిద్యాలయం మంజూరి అయినందున రాష్ట్ర ప్రభుత్వము మండల పరిధిలోని చల్మెడ గ్రామ శివారులోని తిరుమల స్వామి ఆలయ సన్నిధిలో నీ ఎండోమెంట్ భూములలో కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని నిర్మించాలని తిరుమల స్వామి ఆలయ కమిటీ చైర్మన్ అక్క పల్లి రాంరెడ్డి కోరారు .ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ మండల ప్రజల కోరిక మేరకు. తిరుమల స్వామి ఆలయ ఎండోమెంట్ భూములు దాదాపు 282 ఎకరాల స్థలం ఉన్నందున ఇట్టి స్థలంలో కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని నిర్మించాలని కోరుతున్నామన్నారు . విద్యాపరంగా మెదక్ జిల్లా వెనుకబడిందని అందులో నిజాంపేట మండలం ఇంకా చాలా వెనుకబడి ఉన్నందున ఇక్కడ కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని నిర్మించినట్లయితే నిరుద్యోగ యువతకు ఎన్నో ఉపాధి అవకాశాలు లభిస్తాయి అని అభిప్రాయ పడుతున్నామన్నారు. బాసరలో త్రిబుల్ ఐటీ నిర్మించడం వలన అక్కడ విద్యాపరంగా అభివృద్ధి చెందుతున్నారని, అదే మాదిరిగా తిరుమల స్వామి ఆలయ సన్నిధిలో కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని నిర్మించినట్లయితే ఈ ప్రాంతము అభివృద్ధి చెందుతుందన్నారు. మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు స్పందించి చల్మెడ తిరుమల స్వామి ఆలయం సన్నిధిలో కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని నిర్మించాలని 5 ఎకరాల స్థలాన్ని ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని, పాలకమండలి వర్గం కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతుందని అన్నారు. ఎమ్మెల్యే రోహిత్ రావు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తప్పకుండా ఇక్కడ కట్టించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నామన్నారు.