పరకాల నేటిధాత్రి
హనుమకొండ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కె.ఆర్ దిలీప్ రాజ్ ని హనుమకొండ యూత్ కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ బొచ్చు కోమల మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ యూత్ కాంగ్రెస్ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని యువతే ఈ దేశానికి వెన్నుముక అని అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్ర ప్రజలకు బీసీ కుల గణన, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ నివేదికలను శాసనసభలో ఆమోదించ చేయడం చరిత్ర ఆత్మకు,సాహసోపేతం అని అన్నారు.అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రివర్యుల రేవంత్ రెడ్డికి ఎంమ్మార్పిఎస్ మందకృష్ణ మాదిగ కు కృతజ్ఞతలు తెలిపారు.త్వరలో జరగబోయే రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రమాణ స్వీకారానికి పెద్ద ఎత్తున తరలించేందుకు తమ వంతు కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు బొచ్చు సంపత్,బొచ్చు అనిల్, పేరుక చరణ్,బొచ్చు రాజు, బొచ్చు నాగరాజు,కోడపాక రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిని కలిసిన జిల్లా వైస్ ప్రెసిడెంట్ బొచ్చు కోమల జెమిని
