కామారెడ్డి జిల్లా/పిట్లం నేటిధాత్రి :
కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని మండల విద్యాధికారి కార్యాలయంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు గురుకుల పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమావేశం జరిగింది. మండల విద్యా అధికారి దేవిసింగ్ ముఖ్యంగా యూ డైస్ డాటా క్యాప్చర్ ఫార్మాట్ లోని లోటుపాట్లను సరిదిద్దాలని, ఆఫర్ ఐడి జెనరేట్ చేసి 50% కంటే ఎక్కువ డేటా నవీకరణ పూర్తవ్వాలని పాఠశాలలకు సూచించారు. టీచర్ డేటా మరియు పిల్లల ఆధార్ ధ్రువీకరణ 100% పూర్తి కావాలని ఆదేశించారు.మండల నోడల్ అధికారి రమణ రావు మాట్లాడుతూ, ఎఫ్.ఎల్.ఎన్ / ఎల్.ఐ.పి బేస్ లైన్ టెస్ట్ మరియు మిడ్ లైన్ టెస్ట్ వివరాలను ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలని, నులి పురుగుల దినోత్సవం ప్రతి పాఠశాలలో నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు హరి సింగ్, అనురాధ మరియు వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సి.ఆర్.పిలు, ఎం.ఐ.ఎస్,కంప్యూటర్ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు.