నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి :
సేఫ్టీ మోకులు ప్రతి గీత కార్మికుడు వినియోగించుకోవాలని చండూరు ఎక్సైజ్ ఇంచార్జ్ సిఐ కుర్మ నాయకులు , తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శిజెర్రిపోతుల ధనంజయ గౌడ్ అన్నారు. శుక్రవారంచండూరు మండల పరిధిలోని బోడంగిపర్తి గ్రామంలోసేఫ్టీ మోకులపైగీత కార్మికులకుశిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సేఫ్టీ మోకులు వినియోగించడం వలన ప్రతి గీత కార్మికుడు తాటి చెట్టు ఎక్కేటప్పుడు ప్రమాదం నుండి బయటపడాలంటే కాటమయ్య రక్షణకవచం చాలా అవసరమని ప్రతి గీత కార్మికుడు వినియోగించుకోవాలనివారు తెలిపారు. సేఫ్టీ మోకులు లేకపోవడం వలన చాలామంది గీత కార్మికులు ప్రమాదాలకు గురవుతున్నారని వారు అన్నారు. కల్లుగీత కార్మికులకు కాటమయ్య రక్షణ కిట్టు ఒక వరమని వారు అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం కల్పించినఈ అవకాశాన్ని గీత కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని వారు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికుల కోసం సేఫ్టీ మోకులపై తీసుకున్న నిర్ణయాన్ని గీత కార్మికులు అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారులు రామారావు, రాకేష్,ఎక్సైజ్ కానిస్టేబుల్ ప్రభాకర్, నల్లగొండ టీంట్రైనర్స్ వీరయ్య, శంకర్ గీత కార్మికులు అంజయ్య, నరసింహతదితరులు పాల్గొన్నారు.
సేఫ్టీ మోకులు ప్రతి గీత కార్మికుడు వినియోగించుకోవాలి : చండూరుఎక్సైజ్ ఇంచార్జ్ సిఐ కుర్మ నాయకులు
![](https://netidhatri.com/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-07-at-3.18.35-PM.jpeg)