నర్సంపేట,నేటిధాత్రి:
సూర్యాపేటలో జరిగిన రెండు అరుణోదయ సంస్కృతిక సమాఖ్య మహాసభను నిర్వహించ నేపథ్యంలో మహాసభలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోగా ఆ కార్యవర్గానికి నూతన రాష్ట్ర నాయకులుగా గుర్రం అజయ్ ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా గుర్రం అజయ్ మాట్లాడుతూ కళ కళ కోసం కాదు కళ ప్రజల కోసం…నిత్యం ప్రజలు దోపిడీకి గురిఅవుతున్న వారిని చైతన్య పరచడంలో అరుణోదయ సంస్కృతిక సమాఖ్యా ఎన్నో కళరంగాలను నిర్వహించి పాటలు,నాటికల రూపంలో గ్రామాల్లోకీ వెళ్లి ప్రదర్శనలు చేయడం జరిగిందన్నారు. పంట పొలాలల్లో అమ్మాలక్కలు పాటలు పాడుకుంటూ పని కష్టంను మరిచిపోయేవారు కానీ నేడు సినిమా రంగంలోని పాటలు ప్రైవేట్ పాటలు అంటూ ప్రజలని అర్ధం లేని పాటలు పాడుతూ మన సంస్కృతికీ దూరం చేస్తున్నారు. కానూరి వెంకటేశ్వర్లు, రామారావు తమ జీవిత కళామంతా తమ జీవితం కలకోసమే దారాపోసి ప్రజల్ని చైతణ్యం చేసారు.ప్రస్తుతం కొందరు కళాకారులు పేరుకోసం, డబ్బుకోసం కళని అమ్ముకుంటున్నారని ఎంతో మంది అరుణోదయ సంస్కృతిక సమైక్య కళ రంగంలో పని చేసి అమరులను స్మరించుకొని వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్తానని అన్నారు.