సామాజిక కార్యకర్త ముసుగులో భూ దందాలకు మద్దతు అరెస్ట్.
చట్టం నుండి ఎవరు తప్పించుకోలేరు
చట్ట వ్యతిరేక పనులు ఎవరు చేసినా శిక్ష తప్పదు.
జమ్మికుంట పట్టణ సిఐ వరగంటి రవి.
“నేటిధాత్రి” జమ్మికుంట.
జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లికి చెందిన షేక్ సాబీర్ అలీ ని అరెస్టు చేసినట్లు పట్టణ సీఐ వర గంటి రవి ఒక ప్రకటనలో తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం, అసాంఘిక కార్యకలాపాలే లక్ష్యంగా సామాజికవేత్త ముసకులు ఎన్నో అక్రమాలు చేసిన షేక్ సాబీర్ అలీపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు నమోదు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. సామాజికవేత్త ముసుగులో అక్రమాలకు పాల్పడుతూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న షేక్ సాబీర్ అలీపై పలు ఫిర్యాదులు రావడంతో కేసు నమోదు చేయడం జరిగిందని సీఐ పేర్కొన్నారు. తనకు సంబంధం లేని ఒక భూ వివాదంలో తల దూర్చి భూ యజమానిని ఇబ్బందులకు గురి చేస్తూ వారిని భయభ్రాంతులకు గురి చేయడంతో బాధితులు ఫిర్యాదు చేశారని గతంలో కూడా జమ్మికుంట పోలీస్ స్టేషన్లో షేక్ సాబీర్లపై పలు కేసులు ఉన్నాయని ఇలాంటి వారు సమాజంలో ఉండడం శ్రేయస్కరం కాదని సిఐ తెలిపారు. చట్ట వ్యతిరేక పనులు ఎవరు చేసిన చట్టం తన పని తాను చేసుకు పోతుందని ప్రజలకు ఇబ్బందులు కలిగించే ఇలాంటివారిని ఉపేక్షించేది లేదని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.