చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు మొకిలె విజేందర్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నుకోబడిన మండల కార్యవర్గ సభ్యులకి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ అసెంబ్లీ కన్వీనర్ మార్త సత్తయ్య పాల్గొని నూతనంగా ఎన్నికైన ఉపాధ్యక్షులు,ప్రధాన కార్యదర్శులకు, కార్యదర్శులకు,కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ శాలువాతో సన్మానం చేశారు. అనంతరం చందుర్తి మండలంలోని అన్ని గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ ని పటిష్ట పరచాలని కోరారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో బిజేపి పార్టి బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపించుకోనె విధంగా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ఉపాధ్యక్షులుగా. 1 లోకోజీ సతీష్ ( మల్యాల ) 2ఎల్లలా తిరుపతి రెడ్డి రామారావుపల్లి) 3 మట్కo మల్లేశం చందుర్తి ప్రధాన కార్యదర్శులుగా 1 మర్రి మల్లేశం చందుర్తి కార్యదర్శులుగా 1.అయోధ్య పర్షరాములు. జోగాపూర్ 2.కొక్కుల నరేష్ .లింగoపేట 3.నాయుని బాపు రెడ్డి. మరిగడ్డ 4.పత్తిపాక శ్రీనివాస్. మల్యాల కార్యవర్గం సభ్యులు గా 1.గంగిపెల్లి మల్లేశం సనుగుల 2.ఉగిలే శ్రీనివాస్ కిష్టంపేట మరియు కార్యకర్తలు సీనియర్ నాయకులు చిలుముల హనుమయ్య చారి, బద్దం తిరుమల్ రెడ్డి,చిర్ల మహేష్, అజమెరా రవి నాయక్, నరగుల సాగర్, గడ్డం రగు, జలగం శ్రీనివాస్ రావు, సునికి రాజు, ఈగ శ్రీధర్, చక్యాల లక్ష్మి నారాయణ నాయకులు పాల్గొన్నారు.