మహబూబ్ నగర్/ నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని తాటికొండ గ్రామానికి చెందిన చెన్నా రాయుడు రూ. 30 వేలు, మాణిక్యమ్మ రూ.10 వేలు, నరసింహులు రూ.60 వేల సీఎం సహాయక నిధి చెక్కులను మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ.. అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలు సీఎం సహాయక నిధిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.