ఎస్సై శ్రీనివాస్ రెడ్డి కి వినతిపత్రం
నిజాంపేట: నేటి ధాత్రి
నిజాంపేట మండలం నార్లాపూర్ గ్రామంలో సరస్వతి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని టెలికామ్ బోర్డు మెంబర్ ఆకుల రమేష్ స్థానిక ఎస్సై శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చదువులో తల్లి సరస్వతి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను గుర్తించి చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో బైరం నరసింహులు, మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, పుట్టి మల్లేష్, నవీన్ గౌడ్, శీను, నరేందర్, సిద్ధిరాంరెడ్డి ,ప్రణయ్ కుమార్, బాజా అంజయ్య, యాదగిరి తదితరులు పాల్గొన్నారు