భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి సర్కిల్ ఆఫీస్ వద్ద తెలంగాణ విద్యుత్ అర్టిజన్ జేఏసీ రెండవ రోజు రిలే నిరాహార దీక్షను సిఐటియు జిల్లా కార్యదర్శి బందు సాయిలు కార్మికులకు పూలమాలలు వేసి దీక్ష ప్రారంభించారు ఈ సందర్భంగా బందు సాయిలు మాట్లాడుతూ ఆర్టిజన్ కార్మికుల న్యాయమైన డిమాండ్స్ కన్వర్షన్ ఉన్నాయి విద్యుత్ శాఖలో సుమారు 19665 మంది ఆర్టిజన్ కార్మికులు ఉన్నారు ఆర్టిజన్ కార్మికుల కన్వర్షన్ వెంటనే చేయాలని అన్నారు ఒకే సంస్థలో ఒకే రూల్స్ ఉండాలని వేరువేరు సర్వీస్ రూల్స్ ఉండడం వలన ఆర్టిజన్ కార్మికులకు రిటైర్మెంట్ అయ్యేటప్పుడు గ్రాడ్యూటీ లేకుండా కాళీ చేతులతో రిటర్మెంట్ అవుతున్నారు కావున తక్షణమే ప్రభుత్వం యాజమాన్యం ఏపీ ఎస్ ఇబి రూల్స్ తో ఉన్నటువంటి కన్వర్షన్ ఇవ్వాలి అర్టిజాన్ కార్మికుల విద్యా అర్హతను బట్టి కన్వర్షన్ చేయాలి ఐటిఐ చేసిన వారికి జేఎల్ఎంలు డిగ్రీ చేసిన వారికి జూనియర్ అసిస్టెంట్ టెన్త్ చదివిన వారికి ఆఫీస్ సబ్ అపార్ట్మెంట్ గా కన్వర్షన్ ఇవ్వాలని ఈ సానుకూల సమస్యలను పరిష్కరించి వెంటనే కన్వర్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో చైర్మన్ తిప్పారపు రాజు కన్వీనర్ కోటి కొ కన్వీనర్ కోసారి భాస్కర్ నవీన్ కృష్ణమూర్తి సాంబమూర్తి రాజేందర్ బాపూరావు బిక్షపతి సమ్మయ్య శ్రీధర్ రెడ్డి శ్రీనివాస్ భావనపల్లి రమేష్ అలకంటి రమేష్ తదితరులు పాల్గొన్నారు