గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
ప్రగతిశీల యువజన సంఘం (పి వై ఎల్) రెండు సంఘాలు ఈనెల 22వ తేదీన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో వీలీనమవుతున్నాయని ఈ సభకు యువకులు అధిక సంఖ్యలో హాజరై ఈ ఐక్యత సభను జయప్రదం చేయాలని ప్రగతిశీల యువజన సంఘం (పి వై ఎల్) రాష్ట్ర అధ్యక్షులు మోకాళ్ళ రమేష్, జిల్లా ప్రధానకార్యదర్శి పర్శక రవి పిలుపునిచ్చారు.
సోమవారం గుండాల మండల కేంద్రంలో జరిగిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ సమావేశంలో విరు మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ మూడవసారి అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో ఫాసిజం పేరుతో దళితులు, మైనార్టీలు, క్రిస్టియన్స్, ఆదివాసీలపైన దాడులు ఎక్కువయ్యాయని, ముఖ్యంగా మధ్య భారతంలో ఆదివాసీలను అడవుల నుండి వెళ్లగొట్టి , ఆదివాసీల కాళ్ళ కింద ఉన్న, ఖనిజాలను,అడవులను కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పి ప్రయత్నం చేస్తున్నారని, వీటిని ఎదిరించిన ఆదివాసీలను అనేకమందిని ఎన్కౌంటర్ పేరుతో హాత్యగావించారని ఆరోపించారు.
నిరుద్యోగులకు ప్రతి సంవత్సరంరెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ఎన్నికల ముందు ప్రధానినరేంద్ర మోడీ వాగ్దానం చేశారు. ఈ వాగ్దానాన్ని అమలు చేయకపోగా అనేక ప్రభుత్వ రంగ సంస్థలలను ప్రైవేట్ పరం చేసి ఈ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులను బజార్ కి ఇడ్చారని అన్నారు.
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చి వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు.
వెంటనే అన్ని ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసి ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రగతిశీల యువజన సంఘం (పివైఎల్) జిల్లా అధ్యక్షులు చింత నరసింహారావు, జిల్లా సహాయ కార్యదర్శి నోముల బాను చందర్, వాంకుడోత్ మోతిలాల్, అర్ ఉపేందర్, అట్టికం శేఖర్, తాటి రమేష్, ఎనగంటి లాజర్, కల్తి ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.
ఆలేరులో జరిగే యువజన సంఘాల ఐక్యత సభను జయప్రదం చేయండి
