# ఎలక్ట్రికల్ బైక్ షోరూంను ప్రారంభించిన ఎస్సై గోవర్ధన్.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
నూతన టెక్నాలజీతో పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా ప్రజలకు అందుబాటులోకి వస్తున్న ఎలక్ట్రికల్ వాహనాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని కాలుష్యం నివారణకు సహకరించాలని ఎస్సై గోవర్ధన్ పేర్కొన్నారు మండల కేంద్రంలోని చింతకింది కుమారస్వామి ఫ్రాంక్లిన్ఎలక్ట్రికల్ బైక్ షోరూం నెలకొల్పుగా సోమవారం ఎస్సై గోవర్ధన్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో కాలుష్య వాతావరణం ఎక్కువై ప్రజలందరూ అనారోగ్యాలకు గురవుతున్నారని దాని దృష్టిలో తీసుకొని కేంద్ర ప్రభుత్వం పలు అనేక కంపెనీల ద్వారా కాలుష్యాన్ని నివారించేందుకు ఎలక్ట్రికల్ వాహనాలను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని వీటిని పట్టణ ప్రజలే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని వాతావరణని కాపాడాలని అలాగే పలు దేశాలలో క్రూడ్ ఆయిల్ విపరీతంగా కలుషితమై పర్యావరణాన్ని దెబ్బ తీసే విధంగా ఉండగా ప్రపంచంలోని పలు దేశాలలో ఇప్పటికే ఎలక్ట్రికల్ వాహనాలు వాడడం జరుగుతుందని అందుకే మండల ప్రజలు భావితరాల పిల్లలకు మంచి భవిష్యత్తు అందే విధంగా కాలుష్యం లేని వాతావరణాన్ని అందించే విధంగా ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్రాంక్లిన్ కంపెనీ ప్రతినిధి గడ్డం అయ్యప్ప దాస్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి, తాజా మాజీ సర్పంచులు మామిళ్ళ మోహన్ రెడ్డి, చీకటి ప్రకాష్, మండల నాయకులు రేవూరు నరసింహ రెడ్డి, నాగేల్లి తిరుపతిరెడ్డి, బొడిగె సమ్మయ్య, మాజీ ఎంపిటిసి వీరస్వామి, బత్తిని మల్లయ్య, సొసైటీ డైరెక్టర్ కొనుక్కటి వీరమల్లు, భోగ భద్రయ్య, బూస కుమారస్వామి, చింతకింది శ్రీహరి, కోల లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.