అధికారాన్ని అడ్డుపెట్టుకొని.. అడ్డగోలు సెటిల్మెంట్లు..!

బిఆర్ఎస్ పార్టీ ఆర్ఎస్ఎస్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

అధికారాన్ని అడ్డుపెట్టుకొని నర్సంపేటలో అడ్డగోలు సెటిల్మెంట్లు చేస్తున్నారని బిఆర్ఎస్ పార్టీ రైతు సమన్వయ సమితి రాష్ట్ర మాజీ డైరెక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఆరోపణలను చేశారు.అరాచకాలు బ్లాక్మెయిల్ తో కాలం గడుపుతున్న కాంగ్రెస్ నాయకులకు బిఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ఆయన విమర్శించారు. శనివారం నర్సంపేట పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నుండి నర్సంపేట పట్టణంలో ఆ పార్టీకి చెందిన చోట మోటా నాయకులు వ్యాపార, వాణిజ్య, సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ అధికారులను అదుపులో పెట్టుకొని ఫిర్యాదులు చేస్తూ సెటిల్మెంట్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు.పట్టణంలోని మాదన్నపేట రోడ్డు మల్లంపల్లి రోడ్డు ప్రాంతమంతా 111 సర్వే నెంబరులో సుమారు 2800 ఎకరాల విస్తీర్ణంలో గత 40 సంవత్సరాల కాలం నుండి ప్రజలు ఇండ్లు నిర్మాణం చేసుకొని వాణిజ్య వ్యాపారాలు చేసుకుంటున్నారన్నారు. వీరికి రక్షణ కల్పించేది పోయి కంచె చేను మేసిన విధంగా ఇటీవల కాలంలో ఏకపక్షంగా ఒక చిరు వ్యాపారి ఇంటిపైన,వ్యాపార సంస్థలపైన ఫిర్యాదులు చేసి బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నారని అన్నారు.అధికార పార్టీ నాయకునిగా చలామణి అవుతున్న ప్రముఖ నాయకుడు 2024-25 సంవత్సరంలో మల్లంపల్లి రోడ్డుకు ఏజెన్సీ ప్రాంతమైన రాజుపేట శివారులో 117/1/15బి లో రెండెకరాల స్థలాన్ని కొనుగోలు చేసి అక్రమంగా వెంచర్ చేసి అమ్మకాలు చేస్తున్నాడని ఈ నేపథ్యంలో ఆయనకు ప్రభుత్వ నిబంధనలు వర్తించవా అని ప్రశ్నించారు.ఇటీవల కాలంలో నెక్కొండ రోడ్డులో అన్ని అనుమతులు తీసుకొని వెంచర్ వేసి ఫ్లాట్లు క్రయవిక్రయాలు జరిగి సంవత్సరాలు గడిచిన తర్వాత అధికారంలోకి రాగానే అధికారులను బెదిరించి వెంచర్ లోపలికి పోకుండా దారి మూత వేసి ట్రెంచ్ కొట్టించడంలో ఆంతర్యం ఏమిటి అని అడిగారు. మున్సిపల్ పాలకవర్గ పదవి కాలం కొద్ది రోజుల్లో ముగిస్తుందని తెలిసి పట్టణంలో కొత్తగా నిర్మాణం చేపడుతున్న ఇండ్ల యాజమాన్యాల దగ్గరకు వెళ్లి మున్సిపల్ పర్మిషన్ లేవని, గతంలో ఏర్పాటైన వెంచర్ల దగ్గరికి వెళ్లి పర్మిషన్లు లేవని బెదిరింపులకు గురి చేస్తూ వసూళ్లకు పాల్పడుతున్న ఘటనలు నర్సంపేట పట్టణంలో అనేకం ఉన్నాయని ఆరోపణ చేశారు. అవసరాల కోసం పొద్దున పార్టీ మారి సాయంత్రానికి తిరిగి సొంత ఇంటికి వచ్చానని చెప్పుకునే వారు పార్టీల ఫిరాయింపుల గురించి మాట్లాడే హక్కు ఉందా అని ప్రశ్నించారు.నర్సంపేట పట్టణ అభివృద్ధి కోసం మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ ఎనిమిది కిలోమీటర్ల మేర సెంట్రల్ లైటింగ్ డివైడర్ల పనులు చేశారని అర్బన్ మిషన్ భగీరథ ప్రాజెక్టు కింద 32 కోట్ల తో 40 లక్షల లీటర్ల నీటి కెపాసిటీ గల కొత్త వాటర్ ట్యాంకులు నిర్మాణం చేపట్టారని, వరంగల్ రోడ్డు జంక్షన్, పాకాల రోడ్ జంక్షన్ అభివృద్ధి చేశారని జిల్లా ఆసుపత్రి ,మెడికల్ కళాశాల, 18 రకాల ఉచిత పరీక్షల డయాగ్నస్టిక్ ,డయాలసిస్ సెంటర్, బ్లడ్ బ్యాంక్ లాంటి సౌకర్యాలు చేసిన అభివృద్ధి కళ్ళకు అగుపడుతలేదా ఎద్దేవా చేశారు. అభివృద్ధిలో భాగంగా ఆడిటోరియం ,వెజ్ మార్కెట్, నాన్ వెజ్ మార్కెట్ పనులు 90 శాతం నిర్మాణ పనులు పూర్తి అయ్యాయని మిగతా పనులు మరియు 24 వార్డుల్లో మిషన్ భగీరథ పనులు జరుగుతున్న క్రమంలో ధ్వసరమైన రోడ్ల నిర్మాణానికి, సైడ్ కాలువల నిర్మాణ కోసం టఫ్ అండ్ కో నిధుల నుండి 40 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన విషయాన్ని మరిచి ఆ నిధులతోనే ఇప్పుడు నర్సంపేట పట్టణంలో సైడు డ్రైనేజీల నిర్మాణం సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతుందని చెపితే ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు.ఈవాస్తవాలు ఎప్పటికైనా ప్రజలకు అర్థమయితాయని మేమే నిధులు పట్టుకొచ్చి పనులు చేపడుతున్నామని గొప్పలు చెప్పడం కాదని మా మున్సిపల్ పాలకవర్గంలోని పనుల కోసం మాజీ శాసనసభ్యులు తీర్మానాలు పంపిన పనుల్ని నేడు పట్టణంలో పనులు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్నాయని అన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు నాగేల్లి వెంకటనారాయణ గౌడ్ , బిఆర్ఎస్ డివిజన్ నాయకులు డాక్టర్లు లెక్కల విద్యాసాగర్ రెడ్డి , బిఆర్టీయు
జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు, క్లస్టర్ బాధ్యులు బండి రమేష్,ప్రధాన కార్యదర్శి వెన్నుముద్దుల శ్రీధర్ రెడ్డి, యువజన పట్టణ అధ్యక్షుడు రాయిడి దుశాంత్ రెడ్డి, కౌన్సిలర్ దేవోజు తిరుమల సదానందం, గందె రజిత చంద్రమౌళి ,రామ సాయం శ్రీదేవి సుధాకర్ రెడ్డి, ప్రచార కార్యదర్శి మండల శ్రీనివాస్ ,వార్డు అధ్యక్షులు రావుల సతీష్ ,సంపంగి సాలయ్య ,చుక్కా అనిల్ ,మద్దెల సాంబయ్య, పల్నాటి సాంబయ్య, సందీప్, దొమ్మటి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!