https://epaper.netidhatri.com/view/487/netidhathri-e-paper-19th-jan-2025
-ఐదు రకాల కుంభమేళాలు.
-గురు, సూర్యచంద్రుల సూర్యచంద్రుల స్థానాలను బట్టి.
-మహా కుంభమేళాలో పుణ్య తిధులు.
-40 కోట్లకు పైగా భక్తులు వస్తారని అంచనా.
-అప్రతిష్ట పాలు చేసేందుకు కుయుక్తులు.
-పాకిస్తాన్ ఏడుపు.
హైదరాబాద్,నేటిధాత్రి:
ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సమ్మేళనం కుంభమేళా ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతోంది. పురాతన కాలంనుంచి అవిచ్ఛినంగా కొనసాగుతూ వస్తున్న భారతీయ సనాతనధర్మ సం స్కృతికి ప్రతీక. అత్యంత చైతన్యశీలమైన మేళా మనదేశంలో జరిగే ఆధ్యాత్మిక సమ్మేళనాలు లేదా కార్యక్రమాలన్నింటికీ తలమానికం. శ్రీమద్భాగవతం, మహాభారతం, విష్ణుపురాల్లో ఈ కుంభమేళా గురించిన ప్రస్తావన వుంది. కుంభమేళా ఏవిధంగా ప్రారంభమైందనేదానిపై రెండు కథనాలు ప్రచారంలో వున్నాయి. మొదటిది దేవదానవులు అమృతంకోసంసముద్రాన్ని మధించినప్పుడు అమృతం పుట్టింది. దీనికోసం దేవాసురులు పోటీపడితే ఇంద్ర కుమారుడు జయంతుడు అమృతభాండాన్ని తీసుకొని అక్కడినుంచి వెళ్లిపోతాడు. దీన్నిగమనించిన రాక్షసులు అతడి వెంటపడితే పారిపోతూ ప్రయాగ, హరిద్వార్, నాసిక్, ఉజ్జయినిల్లో అలసట తీర్చుకునేందుకు విశ్రాంతి తీసుకున్నాడు. దేవతల కాలమానం ప్రకా రం ఇది 12రోజుల పాటు జరిగింది. ఇది మానవుల కాలమానం ప్రకారం 12ఏళ్లకు సమానం. ఈ అమృతభాండం ఆయా ప్రాంతాలను స్పృజించడం వల్ల ఈ ప్రాంతాలు పవి త్రతను పొందాయి. ఇక మరో కథనం ప్రకారం సాగర మధనంలో పుట్టిన అమృత భాండాన్ని తీసుకొని దేవతలు వెళుతుండగా అందులోని అమృత బిందువులు ప్రయాగ్ రాజ్,హరిద్వార్, నాసిక్, ఉజ్జయినిల్లో పడ్డాయి.ఈ ప్రదేశాల్లోనే కుంభమేళాలు జరుగుతాయి.
ఐదురకాల కుంభమేళాలు
ఇక కుంబమేళా మొత్తం ఐదు రకాలు. మహాకుంభమేళా, పూర్ణకుంభమేళా, అర్థకుంభమేళా, కుంభమేళా, మాఫ్ు కుంభమేళా. వీటిల్లో మహాకుంభమేళా ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్) లో మాత్రమే జరుగుతుంది. ప్రతి 144 సంవత్సరాలకు లేదా 12 కుంభమేళాల త ర్వాత దీన్ని నిర్వహిస్తారు. ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌లో జరిగేది మహాకుంభమేళా. మళ్లీ మనం ఇటువంటి కుంభమేళాను మన జీవితకాలంలో చూడలేం. పూర్ణకుంభమేళా ప్రతి 12ఏళ్లకు ఒకసారి అలహాబాద్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయినిల్లో జరుగుతుంది. అర్థకుంభమేళా ఆరేళ్లకోసారి హరిద్వార్, అలహాబాద్‌ల్లో నిర్వహిస్తారు. కుంభమేళా ఉజ్జయిని, అలహాబాద్, నాసిక్, హరిద్వార్‌లలో జరుగుతుంది. మాఫ్ు కుంభమేళా ఏడాదికొకసారి జనవరి`ఫిబ్రవరి మాసాల్లో 45రోజుల పాటు ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్)లో మాత్రమే ని ర్వహిస్తారు. దీన్నే మినీ కుంభ్ అని కూడా పిలుస్తారు.
గురు, సూర్యచంద్రుల స్థానాలను బట్టి…
విశేషమేంటంటే బృహస్పతి (గురు), సూర్యచంద్రుల స్థానాలను బట్టి కుంభమేళాను నిర్ణ యిస్తారు.ఉదాహరణకు బృహస్పతి కుంభరాశిలోకి, సూర్యుడు మేషరాశి లేదా సూర్యచం ద్రులు కర్కాటకరాశిలోకి ప్రవేశించినప్పుడు మాఫ్ుకుంభ్మేళాను నిర్వహిస్తారు. అంటే ఈ కుంభమేళా మాఘమాసంలో వస్తుంది. బృహస్పతి వృషభరాశిలో, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహిస్తారు. బృహస్పతి, సూర్యుడు సింహ రాశిలోకి ప్రవేశించినప్పుడు నాసిక్‌లో గోదావరి వద్ద, బృహస్పతి సిం హరాశిలోకి, సూర్యుడు మేషరాశిలోకి లేదా సూర్యచంద్రులు తులారాశిలోకి ప్రవేశించినప్పుడు ఉజ్జయినిలో క్షిప్రానది వద్ద కుంభమేళా జరుగుతుంది. సూర్యుడు మేషరాశిలో, బృహస్పతి కుంభరాశలో వున్నప్పుడు హరిద్వార్‌లో గంగవద్ద కుంభమేళా జరుగుతుంది.
ఈ మహా కుంభమేళాలో పుణ్యతిథులు
జనవరి 13వ తేదీ పూర్ణిమ నాటినుంచి ఫివ్రబరి 26 మహాశివరాత్రి వరకు ప్రస్తుత పూ ర్ణ కుంభమేళా ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్నది. ఈ మధ్యకాలంలో కొన్ని పుణ్యతిథులను పెద్దలు నిర్ణయించారు. జనవరి 13 పుష్యపూర్ణిమ, 14న మకరసంక్రాంతి (తొలి పుణ్య స్నానం), జనవరి 29న మౌని అమావాశ్య (రెండో పుణ్యస్నానం), ఫిబ్రవరి 3న వసంత పంచమి (మూడవ పుణ్యస్నానం), ఫిబ్రవరి 4న అచల సప్తమి, 12న మాఘ పౌర్ణమి, 26న మహాశివరాత్రి (చివరి పుణ్యస్నానం)లను స్నానాలకు పవిత్ర తిథులుగా వేదవిదులుపేర్కొన్నారు. ఇక ఫిబ్రవరి 26 అమావాశ్యను మౌని అమవాశ్యగా పిలుస్తున్నారు. ఈరో జు చేసే స్నానం అన్నిస్నానాల్లోకి అతి పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈరోజున పూర్వీకు లను స్మరించుకుంటూ స్నానమాచరించి, దానధర్మాలు చేస్తే ప్రతికూలతలు తొలగిపోయి అంతా మంచే జరుగుతుందని విశ్వాసం.
40కోట్లకు పైగా వస్తారని అంచనా
ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా ప్రాంతాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కొత్త జిల్లాగా ప్రకటించింది. ఆవిధంగా ఉత్తరప్రదేశ్‌లో ఇది 76వ జిల్లాగా ఆవిర్భవించింది. ఈసారి కుంభమేళా కు వచ్చే భక్తుల సంఖ్య 40కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే తొలి రెండు రోజుల్లోనే మూడున్నర కోట్లమంది త్రివేణీ సంగమంలో సాన్నాలు అచరించారు. గతంలో అఖిలేష్ యాదవ్ ప్రభుత్వ హయాంలో 20కోట్లమంది కుంభమేళాకు హాజరైన నేపథ్యంలో ఈ అంచనా వేస్తున్నారు. ఈ మేళా నిర్వహ ణకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ.7500 కోట్లు ఖర్చుచేస్తుండగా, కేంద్రం రూ.2100 కోట్లు సహాయంగా రెండువిడతలుగా అందజేస్తోంది. మొత్తం కుంభమేళాలో మౌని అమావాశ్యకే అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. 1882లో మనదేశ జనాభా 22.5కోట్లు కాగా, అదే ఏడాది కుంభమేళా సంద ర్భంగా మౌని అమావాశ్యనాడు 8లక్షల మంది పవిత్ర స్నానాలు చేశారు. 1894లో పదిలక్షలు, 1906లో 25లక్షలు, 1918లో 30లక్షలమంది భక్తులు కుంభమేళా స్నానాలు ఆచరించారు. 1942 కుంభమేళాకు అప్పటి గవర్నర్ జనరల్ లిన్లిత్గో మదన్మోహన్ మాలవ్యాతో కలిసి హాజరై ఇంతటి జనసందోహాన్ని చూసి ఆశ్చర్యపోయారట!
అప్రతిష్ట పాలు చేసేందుకు కుయుక్తులు
నిజం చెప్పాలంటే ఇది కేవలం ఆధ్యాత్మిక ఉత్సవం మాత్రమే కాదు, పెద్ద ఎత్తున వ్యాపార లావాదేవీలు జరిగే సమయం కూడా. ఒక అంచనా ప్రకారం కుంభమేళాలో రెండున్నర నుంచి మూడున్నర లక్షల కోట్ల మేర వాణిజ్య లావాదేవీలు జరుగుతాయి. మరి ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది రూ.7500 కోట్లు కాగా ప్రభుత్వ ఖజానాకు చేరేది ఏకంగా రూ. 30వేల కోట్లు! కుంభమేళా లక్షన్నరమందికి ఉపాధి కల్పిస్తోంది. ఉదాహరణకు ఒక చాయ్ అమ్ముకునే వ్యక్తిని పరిశీలిస్తే అతని రోజువారీ ఆదాయం రూ.8వేలుగా తేలింది. ఇటువంటి పదివేలమంది చాయ్వాలాలు కుంభమేళాలో చాయ్‌ల అమ్మకం ద్వారా ఉపాధి పొందుతున్నారు. టీ అమ్మకాల ద్వారా కుంభమేళాలో వచ్చే ఆదాయం రూ.360కోట్లు!! అంటే మిగిలిన వ్యాపారాలు ఏవిధంగా వుంటాయో అర్థం చేసుకోవచ్చు. దేశ ఆర్థిక వ్యవస్థలోకి ఏవిధమైన ప్రమేయం లేకుండా నిధుల ప్రవాహం ఇంతపెద్దమొత్తంలో జరగడం చాలా విశేషం! దీన్ని సహించలేని కొందరు దుర్మార్గులు తప్పుడు వార్తలు ప్రసారం చేసి కుంభమేళా ప్రాభవాన్ని దెబ్బతీయాలని చూడటం కూడా సహజమే! ఎందుకంటే కుంభ మేళాలో తొక్కిసలాట జరిగిందని 11మంది మరణించారంటూ యు.పి.కి చెందిన లల్లూ యాదవ్ సంజీవ్ అనే ఒక యూట్యూబర్ తప్పుడు కథనాన్ని ప్రసారం చేసాడు. దీన్ని మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ ప్రసారం చేయాలని చూసినా విజయవంతం కాలేదు. విచిత్రమేమం టే అన్ని కోట్లమంది స్నానాలు చేసినా ప్రశాంతంగా కుంభమేళా సాగుతోంది తప్ప అక్క డ ఎటువంటి తొక్కిసలాట జరగలేదు. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకెన్లు ఇచ్చే సమయంలో తొక్కిసలాట జరిగి ఆరుగురు మరణించారు. కొన్ని ఛానళ్ల వారు అక్కడ సాధన చేసుకుంటున్న సాధువులను ఇంటర్వ్యూల పేరుతో అనవసర ప్రశ్నలు వే స్తూ విసిగిస్తుంటే భరించలేక వారిని తరిమివేసిన సంఘటనలు కూడా జరిగాయి!! ఈ వీడియోలను ప్రసారం చేసి, సన్యాసులు కోపిష్టులంటూ తప్పుడు ప్రచారం చేయడం కూడా జరిగింది. మరో విచిత్రమేమంటే ఏడాదిన్నరకాలంగా ఆధ్యాత్మిక మార్గాన్ని స్వీకరించిన, గతంలో టి.వి.లో పనిచేసిన ఒక మహిళ కుంభమేళా స్నానానికి వచ్చినప్పుడు, కొన్ని ఛానళ్లు ఆమె గతంలో టి.వి.లో పనిచేసినప్పుడు ఫ్యాషన్ దుస్తులు అర్థననగ్న దుస్తులతో ఉన్న ఆమె ఫోటోలను ప్రసారం చేస్తూ, ఈమె దొంగసన్యాసి అనే ప్రచారం చేయడానికి యత్నించడం మరో విషాదం. ఆమె తాను ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నానని మాత్రమే చె బుతున్నది. కానీ అందుకు చిలవలు పలవలు సృష్టించి తప్పుడు ప్రచారం చేసే ప్రయ త్నం కూడా జరుగుతోంది. ఇదే సమయంలో హర్యానా, రaార్ఖండ్ల్లో వున్న నేరగాళ్లు రంగంలోకి దిగారు. హోటల్ రూమ్స్ బుక్‌చేస్తామని, దర్శనాలు చేయిస్తామంటూ ఆన్లైన్ లో ప్రకటనలు జారీచేస్తూ, డబ్బులు వసూలు చేసుకొని మాయమైపోవడం జరుగుతోంది. కుంభమేళాలో సాధువుల రూపంలో ఉగ్రవాదులు ప్రవేశించారని వారని పోలీసులు పట్టుకున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. యతీంద్రసింహానంద సరస్వతి అనే స్వామీజీ గుడారం వద్దకు ఒక కుర్రవాడు వచ్చి తనను ఆయుష్‌గా పరిచయం చేసుకున్నాడు. అతని ప్రవర్తన అనుమానాస్పదంగా వుండటంతో తరచి తరచి ప్రశ్నిస్తే అతని పేరు ఆయూబ్గా తేలింది. ఇతన్ని ప్రశ్నిస్తున్నారు.
పాకిస్తాన్ ఏడుపు
కుంభమేళా అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మాత్రమే కాదు, సామాజిక, ఆర్థిక లావాదేవీలు జరిగే కేంద్రం కూడా. ఈనేపథ్యంలో కుంభమేళా పట్ల ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆసక్తి కనిపిస్తోంది. అన్ని దేశాల్లో కుంభ మేళాకు సంబంధించిన వివరాలు తెలుసుకునే యత్నం జరుగుతోంది. పెద్దఎత్తున విదేశీ భక్తులు గంగలో స్నానం చేస్తున్నారు. ఇక మన పొరుగుదేశం పాకిస్తాన్లో అన్ని వ్యవస్థలు ఈ కుంభమేళాపైనే తమ దృష్టిని పెట్టా యి. యూట్యూబర్లు, ఛానళ్లు, ఇతర మీడియా మరియు ప్రభుత్వ సంస్థల్లో ఎక్కడ చూసి నా ఈ కుంభమేళా గురించిన చర్చలు పెద్దఎత్తున జరుగుతున్నాయి. విచిత్రమేమంటే కుంభమేళా గురించి ప్రశంసలు కురిపించి ఇద్దరు యూట్యూబర్లను పాక్ ప్రభుత్వం జైల్లో పెట్టింది కూడా!! పాకిస్తాన్లో గూగుల్ సెర్చ్‌ల్లో మొదటి స్థానంలో వుంది కుంభమేళా! రెండో స్థానంలో ప్రయాగరాజ్!! ఇతర ముస్లిం దేశాల్లో కూడా కుంభమేళాపై ఆసక్తి కనబరుస్తున్నారు. టర్కీ వంటి ముస్లిం దేశంనుంచి కూడా ప్రజలు కుంభమేళా స్నానాలు చేసి వెళ్లారు. ఇదిలావుండగా కుంభమేళా సందర్భంగా 2 నుంచి 3లక్షల కోట్ల రూపాయలలావాదేవీలు జరుగుతాయన్న అంశం పాకిస్తాన్‌కు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. తాను బిచ్చమెత్తుకునే స్థితిలో ఉంటే భారత్ ఈవిధంగా ఆర్థికంగా సౌభాగ్యపూరితంగా వుండటం దానికి ఎంతమాత్రం నచ్చడంలేదు! అంతకుముందు కుంభమేళాలు జరిగినా ఇంటర్నెట్ సదుపాయం లేకపోవడం వల్ల ఇంత పెద్ద ప్రచారం జరగలేదు. ఇంటర్నెట్ పుణ్యమాని ప్రతి ఒక్క అంశం ఇట్టే తెలిసిపోతుండటంతో పాకిస్తాన్‌కు కునుకుపటడంలేదు. ఏడ్చేవాళ్లు ఎప్పుడూ వుంటారు. కానీ వర్తమాన చరిత్ర చెబుతున్న సత్యం ఒకటుంది. ఏంటంటే భారత్‌ను, ప్రధాని నరేంద్రమోదీని చూసి అక్కసు వెళ్లగక్కే ఇతర దేశాల నాయకులు, ప్రముఖులు క్రమంగా సోదిలోకి లేకుండా పోవడం! ఇందుకు గొప్ప తాజా ఉదా హరణ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో!