హైడ్రా కార్యకలాపాలు ముమ్మరం

అక్రమ ఆక్రమణలపై చర్యలు

ఫుల్‌ ట్యాంకు, బఫర్‌ జోన్లలో నిర్మాణాల కూల్చివేతలు

 

కొన్ని ప్రాంతాల్లో కోర్డు వివాదాలతో అడ్డంకులు

ఔటర్‌ రింగ్‌రోడ్డు పరిధిలో ఆక్రమణలపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు

మూడు రకాల వ్యూహాలతో ముందుకెళుతున్న హైడ్రా

హైడ్రా చర్యలతో చాలా ప్రాంతాల్లో డ్రైనేజీ, వరదకాల్వల పునరుద్ధరణ

 

పబ్లిక్‌ పార్కులు, రోడ్లపై నిర్మాణాల తొలగింపు

హైదరాబాద్‌,నేటిధాత్రి:

హైడ్రా తన కార్యకలాపాలను మళ్లీ ముమ్మరం చేసింది. సంగారెడ్డి జిల్లా నెక్నంపూర్‌ చెరువులో అక్రమంగా నిర్మించిన విల్లాలను నేలమట్టం చేయడం తాజా పరిణామం. ఇక్కడ మొత్తం 13 విల్లాలుండగా, వీటిల్లో రెండు విల్లాలను కోర్డు వివాదం నేపథ్యంలో విడిచిపెట్టి మిగిలిన వాటిని కూల్చివేశారు. పెద్ద చెరువులోని ఫుల్‌ ట్యాంక్‌ లెవెల్‌, బఫర్‌ జోన్‌లలో మున్సిపాలిటీ, ఇరిగేషన్‌ నోటీసులను పట్టించుకోకుండా విల్లాలను నిర్మిస్తుండటంతో హైడ్రా కమిషనర్‌ ఆగ్రహం వ్యక్తంచేయడమే కాకుండా ఇటీవల క్షేత్రస్థాయిలో పరిశీలించి, అ క్రమంగా నిర్మిస్తున్న విల్లాలను కూల్చివేయాలని ఆదేశించడంతో, అధికార్లు పనిపూర్తిచేశారు. ఇక్కడ ఒక్కొక్క విల్లా 400 చదరపు గ జాల్లో నిర్మాణ మయ్యాయి. గత ఏడాది జులైకి ముందు అనుమతులు పొందిన రెసిడెన్షియల్‌ నిర్మాణాలను కూల్చివేయబోమని హైడ్రా అంతకుముందు ప్రకటించింది. అయితే వీటి నిర్మాణాలు ఎప్పుడు చేపట్టింది వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే తగిన నిర్ణయం తీసు కుంటుంది. ఇదే సమయంలో వాణిజ్య నిర్మాణాలు ఎప్పుడు నిర్మించినా, అవి ఫుల్‌ ట్యాంక్‌ లెవె ల్‌ ప్రాంతంలో లేదా సమీపంలో వుంటే కూల్చివేయడం తధ్యమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో నగరంలోని చెరువుల ఫుల్‌ ట్యాంక్‌ లెవెల్‌ (ఎఫ్‌టీఎల్‌) సరిహద్దులను మార్కింగ్‌ చేసే ప్రక్రియను కొనసాగిస్తోంది.
గత సెప్టెంబర్‌ 22న కూకట్‌పల్లిలోని నల్లచెరువు, కిష్టారెడ్డిపేట, సంగారెడ్డి జిల్లాకు చెందిన అ మీన్‌పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని పటేల్‌గూడలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టింది. సెప్టెంబర్‌ 23న మాదాపూర్‌ ప్రాంతానికి చెందిన కావూరిహిల్స్‌లోని స్పోర్ట్స్‌ అకాడమీ భవ నాలపై కూడా హైడ్రా చర్యలు చేపట్టింది. మొదటి డ్రైవ్‌లో హైడ్రా కూకట్‌పల్లి ప్రాంతంలోని 16 భవనాలను, కిష్టారెడ్డిపేటకు చెందిన మూడు ఆర్‌.సి.సి. నిర్మాణాలు మరియు పటేల్‌గూడలోని 25 ఆర్‌.సి.సి.నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. ఇక స్పోర్ట్స్‌ అకాడమీకి చెందిన రెండువేల చదరపు గజాల స్థలంలో పార్క్‌ నిర్మాణంకోసం జీహెచ్‌ఎంసీకి అప్పగించింది.
హైడ్రా ఈవిధంగా అక్రమ నిర్మాణాలపై కొరడా రaుళిపిస్తుండటంతో, వివిధ గృహ నిర్మాణాలకురుణాలు మంజూరు చేసే సంస్థలు జాగ్రత్త పడుతున్నాయి. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ మరియురియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ అనుమతులు మంజూరు చేసిన డాక్యుమెంట్ల పరిశీలనను క్షుణ్ణంగా చేపడుతున్నాయి. ముఖ్యంగా వివిధ బ్యాంకులకు చెందిన అధికార్లు, తమ క్షేత్రస్థాయి సిబ్బందికి, రుణాలు మంజూరు చేసిన గృహాల నిర్మాణాల తనిఖీలపై నిక్కచ్చి ఆదేశాలిస్తున్నాయి. ముఖ్యంగా నీటి తావులకు సమీపంలో నిర్మించే గృహాల నిర్మాణం అనుమతుల ప్రకారమే ఏవిధమై ఉల్లంఘనలకు పాల్పడకుండా జరుగుతున్నదీ లేనిదీ ఎప్పటికప్పుడు కచ్చితమైన సమాచారం సేకరించాలని వారు తమ ఆదేశాల్లో స్పష్టం చేశారు. అయితే ఇప్పటికీ ఈ గృహ రుణాలపై స్పష్టమైన మార్గదర్శకాలేవీ లేనట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో హైడ్రా కూల్చివేతలకు గురైన ఇళ్లకు సంబంధించి తిరిగి రాబట్టుకోవాల్సిన మిగిలిన రుణమొత్తాల విషయంలో బ్యాంకులు ప్రస్తు తం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో చెరువులకు సమీపంలో నిర్మాణాలకు హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీలు అనుమతులను తాత్కాలికంగా నిలుపుచేశాయి. నగరంలోని 400చె రువుల సమీపంలో నిర్మాణలు చేపట్టడానికి అవసరమైన నియమ నిబంధనల్లో స్పష్టత లోపించడమే ఈ నిర్ణయానికి కారణంగా తెలుస్తోంది. సంబంధిత అధికార్లు ఈ నిబంధనల విషయంలో తుది నోటిఫికేషన్‌ జారీచేసేవరకు ఈ తాత్కాలిక నిలిపివేత కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అనుమతుల తాత్కాలిక నిలిపివేత నేపథ్యంలో హైడ్రా గత నవంబర్‌లో ఫిల్మ్‌నగర్‌ ప్రధాన రహ దారిపై వున్న అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. స్థానికులనుంచి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో సంస్థ ఈ చర్యలు తీసుకుంది. ఇదే సమయంలో ఆక్రమణలకు సంబంధించి అందిన ఫిర్యాదుల మేరకు చెరువులు, ఫీడర్‌ కెనాల్స్‌ ఒడ్డున వున్న వ్యర్థాల దిబ్బలు, ఏవిధమైన పరిశీలన లేకుండా చేపడుతున్న నిర్మాణాల తనిఖీలు చేపట్టింది. ఇదే సమయంలో రోడ్డుపై చేపట్టిన అ క్రమ నిర్మాణాలను కూల్చివేసిన వెంటనే రెండు మూడు రోజుల్లోగా ఆ ప్రాంతంలో రోడ్డు నిర్మా ణం పూర్తిచేయాలని హైడ్రా, జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్‌ శాఖను కోరింది. ఇక వాణిజ్య కట్టడాల విషయానికి వస్తే అక్రమమని తేలినప్పుడు తక్షణమే కూల్చివేస్తామని హైడ్రా హెచ్చరించింది. కాముని చెరువు నుంచి మైసమ్మ చెరువుకు 17మీటర్ల వెడల్పున వరదకాల్వ నిర్మాణం పూర్తి చేయకుండా రెసిడెన్షియల్‌ ప్రాజెక్టును కొనసాగిస్తున్న వాసవి గ్రూప్‌కు హైడ్రా హెచ్చరికలు జారీచేసింది. ఈ కాల్వ లేకపోవడం వల్ల సఫ్దర్‌నగర్‌, రాజీవ్‌గాంధీనగర్‌ ప్రాంతాల్లోని మురికివాడల్లో వర్షాకాలంలో పెద్దఎత్తున నీరు నిల్వ వుంటోంది. దీనివల్ల ఆ ప్రాంతంలో నివసించే పేదలు నానాఇ బ్బందులు పడాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలో వచ్చే వర్షాకాలం సీజన్‌ ప్రారంభమయ్యేలోగా ఈ వరదకాల్వ నిర్మాణాన్ని పూర్తిచేయాలని హైడ్రా, వాసవి గ్రూప్‌ను కోరింది.

ఔటర్‌రింగ్‌ రోడ్డు పరిధిలో అక్రమ నిర్మాణాలపై నవంబర్‌కు ముందు విపరీతమైన ఫిర్యాదులు అందడంతో హైడ్రా రంగంలోకి దిగింది. రోడ్లు, పార్కులు, నీటి కాల్వలు వంటి ప్రాంతాలను యదేచ్ఛగా ఆక్రమించి చేపడుతున్న నిర్మాణాల కారణంగా సమస్యలు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో స్థానికులనుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ ఓఆర్‌ఆర్‌ పరిధిలో 27 మున్సిపాలిటీలు, 33 గ్రామ పంచాయతీలు, జీహెచ్‌ఎంసీకి చెందిన కొన్ని ప్రాంతాలున్నాయి. ఇవన్నీ అక్రమ నిర్మాణా లకు హాట్‌స్పాట్‌గా మారడం సమస్యలకు ప్రధాన కారణం. ఇప్పుడు హైడ్రాకు అందుతున్న ఫి ర్యాదులు నగర విస్తరణ వేగంగా జరుగుతున్న ప్రాంతాలకు సంబంధించినవే కావడం గమనా ర్హం. అయితే వీటికి సంబంధించి చర్యలు తీసుకోవడానికి హైడ్రా ముందడుగు వేయడానికి వివిధ సమస్యలు అడ్డంకిగా మారాయి. మొదటగా చాలా భూములకు న్యాయపరమైన వివాదాలుండటంతో హైడ్రాకు చెందిన లీగల్‌ టీమ్‌లు వీటిని చట్టపరిధిలో పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నా యి. కొన్ని నిర్మాణాల విషయంలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొనాల్సి వస్తోంది. ముఖ్యంగా ఇక్కడనిర్మాణాలు చేపట్టినవారి వద్ద ఉన్న డాక్యుమెంట్లు స్పష్టంగా లేకపోవడంతో, హైడ్రా మున్సిపల్‌, రెవెన్యూ రికార్డులను తనిఖీ చేయడం ద్వారా తగిన నిర్ణయం తీసుకొని ముందుకెళుతోంది. మరికొన్ని నిర్మాణాలు, ఆక్రమణలపై చర్యలు తీసుకోవడానికి హైడ్రాకు, మున్సిపల్‌, లీగల్‌, రెవె న్యూ శాఖల మద్దతు అవసరమవుతోంది.

ఈ నేపథ్యంలో ఒకపక్క లీగల్‌ సమస్యలున్న భూములపై చట్టపరంగా చర్యలు కొనసాగిస్తూనే, తక్కువ లీగల్‌ సమస్యలున్న ప్రాంతాలపై దృష్టిపెట్టింది. ఈ ప్రాంతాల్లో తనిఖీలను మరింత ముమ్మరం చేసి, కూల్చివేతలకు ముందుకెళ్ళనుంది. ప్రస్తుతం ఇదే ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగానే 60కి పైగా పెండిరగ్‌లో వున్న ముఖ్యమైన ఫిర్యాదులను పరిష్కరించడం, స్థానిక మరియు జీహెచ్‌ఎంసీ అధికార్ల సమన్వయంతో ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టడం, ఇక ముందు ఆక్రమణలు జరగకుండా ప్రజలను చైతన్యం చేయడం అనే మూడు అంశాలకు హైడ్రా ప్రాధాన్యతనిస్తోంది.ప్రస్తుతం హైడ్రా తీసుకుంటున్న చర్యలకు మిశ్రమ స్పందన వస్తోంది. ముఖ్యంగా పార్కులు వంటి పబ్లిక్‌ ప్రదేశాల్లో ఆక్రమణల తొలగింపునకు ప్రజలనుంచి పూర్తి మద్దతు లభిస్తుండగా, కొన్ని ప్రాంతాల్లో చేపట్టే కూల్చివేతల వల్ల నిరాశ్రయులమవుతున్నామన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.ప్రస్తుతం హైడ్రా చేపడుతున్న చర్యల వల్ల వరద ప్రభావిత ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపడటం,పబ్లిక్‌ పార్కులు, రోడ్లు పునరుద్ధరణకు నోచుకోవడం కీలక పరిణామం. అయితే నోటీసు కాలపరిమితి తక్కువగా వుంటున్నదన్న ఫిర్యాదులున్నాయి. కొన్ని సంక్లిష్ట జోన్లలో న్యాయపరమై వివాదాలు హైడ్రా చర్యలు జాప్యం కావడానికి కారణమవుతున్నాయి.

ప్రస్తుతం హైదరాబాద్‌ మహానగరం అన్ని వైపులా అత్యంత వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పె రుగుతున్న జనాభా అవసరాలకు అనుగు ణంగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ హై డ్రా పటిష్టంగా పనిచేయాలన్నది ప్రభుత్వ సంకల్పం. అంతేకాదు హైదరాబాద్‌ చుట్టుపక్కల 33 గ్రామపంచాయతీలను హైడ్రా పరిధిలోకి తీసుకువచ్చే అవకాశముంది. ఈ గ్రామాల మొత్తం జనాభా రెండు లక్షలు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు లోపలి భాగంలో ఉన్న ఈ పంచాయతీల జాబితాను ఇప్పటికే పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఇప్పటికే తయారుచేసింది. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ హైడ్రా పరిధిని ఓఆర్‌ఆర్‌ పరిధివరకు విస్తరించాలన్న ఉద్దేశంతో వున్న నేపథ్యంలో ఈ పరిధిలో వుండే పంచాయతీల జాబితాను సిద్ధంచేశారు. ప్రస్తుతం ఓఆర్‌ఆర్‌ పరిధిలో 30 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్‌ కార్పొరేషన్లు వున్నాయి. ఇక ఇవన్నీ హైడ్రా పరిధిలోకి రాను న్నాయి. వీటితోపాటు 33 గ్రామపంచాయతీలను కూడా హైడ్రా పరిధిలోకి తీసుకురానుండటంతో ఈ ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ మరింత జోరందుకుంటుందని అంచనా. ప్రస్తుతం నగరంలోని వివిధ చెరువులు, నాలాలు, బఫర్‌ జోన్‌లు యదేచ్ఛగా ఆక్రమణలకు గురికావడంతో వరదనీరు స్వేచ్ఛగా ప్రవహించేందుకు మార్గాలు మూసుకుపోయి ఆక్రమిత ప్రాంతాల్లో గృహాలు ముంపునకు గురికావడం, ఆయా ప్రాంతాల ప్రజలు వరదల కారణంగా నిరాశ్రయలు కావడం జరుగుతోంది. ఈవిధంగా ఆక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగిస్తే ఈ వరద సమస్యకు ఒక పరిష్కారం లభించడమే కాదు, పర్యావరణ పరిరక్షణకూడా సాధ్యంకాగలదు. కానీ ఇటువంటి అక్రమ నిర్మాణాలను తొలగించడమే హైడ్రా ముందున్న ప్రధాన సవాలు. అక్రమ ఆక్రమణలకు గురైన పంచాయతీల్లో కచవాని సింగారం, ప్రతాప్‌ సింగారం, కొర్రెమూల, గౌరెల్లి, చీర్యాల్‌, గుధుమకుంట, రాంపల్లి, కీసర, మంకల్‌, గౌడవల్లి, బమ్రాస్‌పేట్‌, గొల్కండ కలన్‌ వంటి పంచాయతీలు కొన్ని మాత్రమే. వరద ప్రవాహానికి అడ్డుగా పుట్టగొడుగుల మాదిరిగా కాలనీల నిర్మా ణం చేపట్టడంతో వర్షాకాలంలో ఈ ప్రాంతాలను వరదనీరు ముంచెత్తుతోంది.

ఎన్‌.ఆర్‌.ఎస్‌.సి. నివేదిక ప్రకారం గత 44 సంవత్సరాలుగా జంటనగరాల పరిధిలో ఎన్నో చెరువులు/సరస్సులు, కుంటలు అక్రమ కట్టడాల కార ణంగా అదృశ్యమైపోయాయి. వీటిల్లో కొన్ని చెరువులు 60శాతం మరికొన్ని 80శాతం వరకు ఆక్రమణలకు గురయ్యాయి. ఆవిధంగా అదృశ్య మైన 56 చెరువులపై హైడ్రా ప్రస్తుతం అధ్యయనం ప్రారంభించింది. గతంలో ఈ చెరువుల మొత్తం విస్తీర్ణం 40.35 చదరపు కిలోమీటర్లు! ప్రస్తుతం ఇవి కేవలం 16.9 చదరపు కిలోమీటర్లకుకుంచిచుకుపోగా మిగిలిన 24.26 చదరపు కిలోమీటర్లు ఆక్రమణలకు గురయ్యాయి. అంటే చెరువుల అసలు విస్తీర్ణంలో 60% ఆక్రమణలకు గురైందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చెరువుల ఆక్రమణల విషయంలో హైడ్రా మూడు దశలుగా తన కార్యక్రమాలను కొనసాగిస్తోంది. మొదటిదశలో ఆక్రమణల నివారణ, రెండో దశలో ఆక్రమంగా ఆక్రమించి నిర్మించిన భవనాలకు అనుమతుల రద్దు మరియు అటువంటివారిపై కఠిన చర్యలకు ఉపక్రమించడం, ఇక మూడోదశలో ఆయా చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టడం. ఆక్రమణలను తొలగించ డం ద్వారా హైదరాబాద్‌ పర్యావరణాన్ని పూర్వపుస్థాయికి తీసుకురావాలన్న భగీరథ యత్నాన్ని రేవంత్‌ తలకెత్తుకున్న నేపథ్యంలో, ఆయన ప్రభుత్వ ఏర్పాటు చేసిన హైడ్రా సంస్థ ఈ దిశగా తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది. ఎన్నో అడ్డంకులు, అనివార్యతల నేపథ్యంలో సంస్థ మొక్కవో ని దీక్షతో తన విధులను నిర్వరిస్తోందనడంలో ఎంతమాత్రం సందేహంలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!