బిజేపిలో ‘‘బడా బాబులకే’’ సీట్లు!

పలుకుబడితో ‘‘ఎమ్మెల్సీ టిక్కెట్లు!?’’

`గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీకి అర్థం మారుస్తున్నారు.

`తన కంపెనీలలో పని చేసే ఉద్యోగులకే వేజ్‌ బోర్డు అమలు చేయని వాళ్లు నిరుద్యోగులకు న్యాయం చేస్తారా?

`అంజిరెడ్డికి వున్న కంపెనీలలో ఉద్యోగుల ‘‘కార్మిక చట్టాలన్నీ’’ అమలౌతున్నాయా?

`తన ఉద్యోగులకే అందుబాటులో వుండలేని ‘‘అంజిరెడ్డి’’ సగటు నిరుద్యోగికి అప్పాయింట్‌మెంట్‌ ఇస్తాడా?

`అసలు నిరుద్యోగులను తన గుమ్మంలోకి రానిస్తాడా?

`పిల్లికి బిచ్చం పెట్టని వాళ్లు పెద్దల సభకు?

`పది మంది కార్యకర్తల పేరు తెలియని వాళ్లకు పెద్ద పీటలు!

`ఎమ్మెల్సీ ఎన్నికల టిక్కెట్ల కేటాయింపుపై బిజేపిలో అసంతృప్తి.

`టిక్కెట్ల పంపకాలపై మండి పడుతున్న బిజేపి శ్రేణులు.

`కార్పొరేట్‌ వ్యక్తులకు టిక్కెట్లు ఇస్తే జనం గోడు వింటారా?

`నిరుద్యోగుల సమస్యలు పట్టించుకుంటారా?

`నిరుద్యోగుల కోసం రోడ్డెక్కి పోరాటం చేస్తారా?

`యువత భవిష్యత్తు కోసం ఆలోచిస్తారా?

`కార్మికుల పక్షాన పోరాటం చేస్తారా?

`ఉద్యోగుల హక్కులను పరిరక్షిస్తారా?

`కార్పొరేట్‌ వ్యక్తులు ఎమ్మెల్సీలైతే పదవులు అలంకారమౌతాయి.

`పదవులు అడ్డం పెట్టుకుని మరింత అర్థికంగా బలవంతులయ్యేందుకు దోహదమౌతాయి.

`విద్యార్థి దశ నుంచి ఎదిగిన నాయకులకిస్తే జనం కోసం పని చేస్తారు.

`నిరుద్యోగ సమస్యలు తెలిసిన వారికిస్తే పోరాటం చేస్తారు.

`యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం కొట్లాడతారు.

`నిరుద్యోగుల పక్షాన నిలబడి గొంతెత్తుతారా.

`ప్రభుత్వాలకు ఊపిరి సలపకుండా చేస్తారు.

`నిత్యం జనంలో వుంటారు.

`పైగా పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తారు.

`కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటారు

`బిజేపికి బలమైన పునాదులేస్తారు

`నిత్యం నిరుద్యోగుల పక్షాన నిలబడి ఉద్యమాలు సాగిస్తారు.

“నిరుద్యోగులకు ఉపాధి మార్గాలు అన్వేషిస్తారు

`కార్పొరేట్‌ వ్యక్తులు ఎమ్మెల్సీలైతే ప్రజలకు అందుబాటులో వుంటారా?

`పదవుల కోసం పార్టీల పంచన చేరేవాళ్లు, ప్రజలకు చేరువౌతారా?

`నాలుగు ఉమ్మడి జిల్లాల నిరుద్యోగుల పక్షాన నిత్యం పోరాటం సాగిస్తారా?

`పార్టీ పునరాలోచించుకోవాలని బిజేపి నాయకుల విజ్ఞప్తి

`పార్టీలో పోరాట యోధులు అన్ని జిల్లాల ప్రజలకు సుపరిచితులే

`పదవుల కోసమే రాజకీయాలు చేసేవారు ఎప్పటికైనా అపరిచితులే

`జనానికి ఎప్పుడూ కనిపించని అవకాశవాదులే

హైదరాబాద్‌,నేటిధాత్రి:

రాను రాను సంప్రదాయ పార్టీలకు మేమేం తీసిపోము అన్నట్లు బిజేపి కూడా నిరూపిస్తోంది. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్ధుల పేర్లు ప్రకటనలో ఇలాంటి దోరణే కనిపిస్తోందని స్వయంగా ఆ పార్టీకి చెందిన నేతలే అంటున్నారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికే టిక్కెట్లు అన్న నినాదం ఆది నుంచి వుంది. పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు ఇస్తూ వచ్చింది. పార్టీ జెండాలు మోసిన వారికి ప్రాధాన్యత వుంటుంది. అంతే కాకుండా ఆర్‌ఎస్‌ఎస్‌ మూలాలున్న వారికి వుండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అలాంటి వారికి సీట్లు కేటాయింపుపై ఆర్‌ఎస్‌ఎస్‌ చెప్పిందంటే పార్టీ పాటించేది. ఇలా అటు పార్టీకోసం, దేశం కోసం, దర్మం కోసం, ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాల వ్యాప్తి కోసం పనిచేసే వారికి టిక్కెట్లు దక్కుతాయన్న నమ్మకం బలంగా వుండేది. రాను రాను బిజేపి కూడా కేవలం అదికార దాహం కోసమే పనిచేసే పరిస్ధితులు సృష్టించుకుంటోంది. అందుకే ఆ పార్టీ కూడ పార్టీకోసం పనిచేసిన వారితోపాటు, గెలుపు గుర్రాలను ఎంపిక చేసుకోవడం మొదలు పెట్టింది. బైటి పార్టీల నుంచి కూడా పార్టీలోకి నాయకులను ఆహ్వానిస్తోంది. ఇంతకు ముందు ఏ వాదంతో అంటకాగినా సరే, బిజేపిలో చేరేందుకు సుముఖంగా వుంటే చాలు పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇలా పార్టీ వ్యాప్తి కోసం బిజేపి పెద్దలు అనుసరిస్తున్న విధానాలను రాష్ట్ర స్ధాయిలో నాయకులు కూడా వాడుకుంటున్నారు. ఎన్నికల సమయంలో వారి పంతం నెగ్గించుకుంటున్నారు. వాళ్లు ఎవరికి టిక్కెట్లు ఇవ్వాలో ముందే నిర్ణయం తీసుకుంటున్నారు. వాళ్లకే టిక్కెట్లు ఇప్పిస్తున్నారంటూ బిజేపిలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. అందుకు ఇటీవల ప్రకటించిన ఎమ్మెల్సీ టిక్కెట్లే సాక్ష్యం అంటున్నారు. ముఖ్యంగా నాలుగు ఉత్తర తెలంగాణ జిల్లాకు చెందిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధి ఎంపికలో పార్టీ సరైన నిర్ణయం తీసుకోలేదని సీనియన్‌ నాయకులు కూడా వ్యతిరేకిస్తున్నారు. పార్టీ కోసం కరీంనగర్‌, మెదక్‌, నిజాబాబాద్‌, ఆదిలా బాద్‌ ఉమ్మడి జిల్లాల నుంచి గత ముప్పై, నలభై ఏళ్ల నుంచి కష్టపడుతున్న వారు వున్నారు. పార్టీ కోసం తెగించి పోరాటాలు చేసిన వారున్నారు. ప్రాణాలను లెక్క చేయకుండా ఒక దశలో పార్టీ కోసం ప్రాణం పెట్టిన నాయకులున్నారు. వాళ్లేమీ ఆషామాషీ నాయకులు కాదు. ఎంతో మందికి స్పూర్తి నింపిన నాయకులు. ఎంతో మంది యువత బిజేపి భావజాలానికి ఆకర్షితులు కావడానికి కారకులు. అంతగా పార్టీపై ముద్ర వేసిన నాయకులున్నారు. ఈ రోజు పార్టీ ఇంత బలంగా వుందంటే అలాంటి నాయకులే కారణం. బిజేపి పార్టీకి ఎన్నికల్లో ఎన్ని ఎదురుదెబ్బలు ఎదురైనా సరే పడిన ప్రతీసారి నిలబెడుతూ, ప్రజల్లో బిజేపి వ్యాప్తికోసం నిరంతరం పని చేసిన వాళ్లున్నారు. వాళ్లను కాదని పారిశ్రామిక వేత్త అయిన అంజిరెడ్డికి టికెట్‌ కేటాయించడాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోవడం లేదు. అసలు ఆయన ఎవరో కనీసం మెదక్‌ జిల్లా ప్రజలకే పూర్తిగా అవగాహన లేదని అంటున్నారు. ఆయన పారిశ్రామిక వేత్తగా కేవలం కొంత ప్రాంతానికి మాత్రమే సుపరిచితమంటున్నారు. మితగా మూడు జిల్లాల పట్టభద్రులైన బిజేపి శ్రేణులకు ఆయన తెలియదని అంటున్నారు. అలాంటి వ్యక్తికి టికెట్‌ ఇవ్వడం వల్ల ఆయన పార్టీ శ్రేణులను కూడా కలుపుకుంటాడన్న నమ్మకం లేదని చెబుతున్నారు. బడాబాబులకే బిజేపిలో టిక్కెట్లు అని పార్టీ నిరూపించిందని నాయకులు అసంతృప్తికి లోనౌతున్నారు. పలుకుబడి వున్న వాళ్లుకే టిక్కెట్లు ఇస్తామని పార్టీ సంకేతాలు తెలిపినట్లౌందని, సామాన్య కార్యకర్తలకు కష్టకాలమే అంటున్నారు. పిల్లికి బిచ్చం పెట్టన వ్యక్తి అంజిరెడ్డి అంటూ పార్టీ నాయకులే దుమ్మెత్తిపోస్తున్నారు. కనీసం ప్రతి జిల్లాలో పది మంది నాయకులు, కార్యకర్తల పేరు తెలియని అంజిరెడ్డికి టికెట్‌ ఎలా ఇ స్తారని ప్రశ్నిస్తున్నారు. దాంతో పెద్దఎత్తున బిజేపి శ్రేణులు అసంతృప్తికి లోనౌతున్నారు. ఈ ఒక్కటే కాదు, ఎమ్మెల్సీ ఎన్నికల టిక్కెట్ల పంపిణీ వ్యవహారం మొత్తాన్ని తప్పు పడుతున్నారు. మండిపడుతున్నారు. అంజిరెడ్డికి గ్రాడ్యుయేట్‌ స్ధానానికి టిక్కెట్‌ కేటాయించి దాని అర్ధమే మార్చేశారని వాపోతున్నారు. కార్పోరేట్‌ శక్తులకు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్దానం కేటాయిస్తే, ప్రజలు బిజేపి మీద ప్రేమతో గెలిపిస్తే ఆ వ్యక్తి ప్రజల్లో వుంటాడా? జనం గోడు వింటాడా? ఆయన వృత్తి పారిశ్రామిక వేత్త. ఆయన ప్రవృత్తి రాజకీయంగా ఎంచుకొని, ప్రజా ప్రతినిధి అయితే ప్రజలకు చేరవ కావడం కష్టం. ఆయన ఎంత సేపు తన వ్యాపార లావాదేవీలు, వ్యాపార సాంమ్రాజ్య విసృత్తి, పారిశ్రామికంగా మరో ఎత్తు ఎలా ఎదగాలి అన్నదానిపై వున్న ద్యాస ప్రజల మీద వుండదు. ఆ పదవి అడ్డం పెట్టుకొని బ్యాంకులను నమ్మించి, మరిన్ని అప్పులు తెచ్చుకొని మరిన్ని పరిశ్రమల ఏర్పాటు కోసం ఆలోచన చేస్తారు. అంతే కాని పేదల పక్షాన నిలిచేంత సమయం అంజిరెడ్డికి వుండదని సాక్ష్యాత్తు బిజేపి నాయకులే గుసగుసలాడుతున్నారు. అసలు పారిశ్రామిక వేత్తలు నిరుద్యోగుల, ఉద్యోగుల కోరికలు మన్నిస్తారా? వారి కోసం నిలబడతారా? వారికి అండగా వుంటారా?వారి కోసం రోడ్డెక్కుతారా? ప్రభుత్వాలతో పోరాటం చేస్తారా? పారిశ్రామిక వేత్తలకు నిత్యం పాలకులతోనే పని. వారి ఆశీస్సులతోనే వారి వ్యాపారాలు సాగేది. ఏ పార్టీ అధికారంలో వుండే ఆ పార్టీకి గొడుగు పట్టడం మాత్రమే పారిశ్రామిక వేత్తలకు తెలుసు. కాకపోతే జాతీయ స్ధాయిలో బిజేపి అప్రతిహాతంగా గెలుస్తూ వస్తోంది. వ్యాపారపరమైన అన్ని సౌకర్యాలు అనుమతుల కోసం బిజేపి పెద్దల ఆశీస్సుల కోసం పార్టీలో పనిచేసేవాళ్లు కొంత మంది వున్నారు. అందులో అంజిరెడ్డి ఒకరు అని అంటున్నారు. అసలు పారిశ్రామిక వేత్తలుగా వెలుగొందుతున్న వారు తమ పరిశ్రమల్లో పని చేసే కార్మికులకే సరైన వేతానాలు అందించరు. వేజ్‌బోర్డ్‌ అమలు సరిగ్గా అమలు చేయరు. అనేక వివాదాలు ఎదుర్కొంటారు. అలాంటి వారు ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం ప్రయత్నం చేస్తారా? వారి హక్కులను కాపాడుతారా? అంజిరెడ్డికి వున్న కంపనీలలో ఉద్యోగులందరికీ కార్మిక చట్టాలను అమలు చేస్తున్నారా? వారికి న్యాయంగా అందాల్సిన వేతనాలు అందిస్తున్నారా? అన్న ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. తమ ఉద్యోగుల సమస్యలే వినేందుకు సమయం లేని, తీరిక లేని, ఒక రకంగా ఇష్టం వుండని అంజిరెడ్డి సగటు నిరుద్యోగి సమస్యలు వింటాడా? పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాడా? కనీసం సమయం కేటాయిస్తాడా? నిరుద్యోగులకు అప్పాయింట్‌ మెంటు కల్పిస్తాడా? పార్టీ కోసం నాలుగు జిల్లాల్లో క్షేత్ర స్దాయిలో పనిచేస్తాడా? కనీసం తన గుమ్మం దాకా నిరుద్యోగులను రానిస్తాడా? అని కూడా అంటున్నారు. కార్పోరేట్‌ శక్తులు ప్రజా ప్రతినిధులైతే పదవులు వారికి అలంకారమౌతాయే గాని, ప్రజలకు ఒరిగేదేమీ వుండదు. వారికి సమస్యలకు పరిష్కారమే దొరకదు. పదవులు అడ్డం పెట్టుకొని మరింత ఆర్ధికంగా బలవంతులయ్యేందుకు పదవులు ఉపయోగపడతాయే గాని, ఆ పదవి పొందిన నాయకుడితో ప్రజలకు జరిగే న్యాయం ఏమీ వుండదు. సహజంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధులు విద్యార్ధి దశ నుంచి అటు విద్యారంగ సమస్యలు, ఇటు నిరుద్యోగుల సమస్యలపై పూర్తి అవగాహన వున్న విద్యార్ధి నాయకులుగా పనిచేసిన అనుభవం వున్న నాయకులై వుండాలి. అలాంటి వారిని మాత్రమే పార్టీలు ఎంపిక చేయాలి. అప్పుడే వారు జనంలోకి వెళ్లగలరు. విసృతంగా ప్రచారం చేయగలరు. గెలిచిన తర్వాత నిరుద్యోగుల తరుపున నిరంతరం పోరాటం చేస్తారు. యువత, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల కోసం పోరాటం చేస్తారు. విద్యార్ధి, యువజన, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సవాళ్లపై సదస్సులు ఏర్పాటు చేస్తారు. వారిని చైతన్యం చేస్తారు. ప్రభుత్వాలతో కొట్లాడతారు. వారికి అవసరమైన ఉపాది మార్గాలను కూడా ఆ ఎమ్మెల్సీలు అన్వేశిస్తారు. మండలిలో అవకాశం వచ్చిన ప్రతీసారి యువత, నిరుద్యోగుల పక్షాన చర్చలు లేవనెత్తుతారు. ప్రభుత్వాలను నిలదీస్తారు. ప్రభుత్వాలు మొండి వైఖరి అనుసరిస్తే ప్రజా క్షేత్రంలో నిరుద్యోగుల పక్షాన గొంతెత్తుతారు. పాలకులకు ఊపిరి సలపకుండా ఉక్కిరి బిక్కిరిచేస్తారు. అదేపారిశ్రామిక వేత్తలకు పట్టభద్రుల ఎన్నికల సమయంల నిరుద్యోగులను వంచించే నాలుగు మాటలు చెప్పి , గెలిస్తే నిరుద్యోగులకు ముఖం చాటేస్తారు? ఓడితే పార్టీని కూడా పట్టించుకోరు. అందువల్ల ఇప్పటికైనా మార్చుకునే అవకాశం వుంది. బిజేపికి మంచి అవకాశం వుంది. యువత బిజేపి వైపు నిలిచేందుకు ఇష్టపడుతున్నారు. అంజిరెడ్డిని మార్చితే గెలిపించేందుకు సిద్దంగా వున్నామంటున్నారు. పార్టీ అంజిరెడ్డి విషయంలో పునపరిశీలన చేయాలని కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!