కొత్తకోట / నేటి ధాత్రి
వనపర్తి కొత్తకోట మున్సిపల్ పట్టణ కేంద్రంలోని కోట్ల ఆంజనేయస్వామి ఆలయంలో ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకొని సోమవారం కోట్ల రామలింగేశ్వరునికి మహా రుద్రాభిషేకం 10వేల బిల్వ పుష్పార్చన కార్యక్రమం మహా మండల శివ స్వాముల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నూతన సంక్రాంతి భోగి పండగ భాగంగా సోమవారం ఆరుద్ర నక్షత్రంలో శివ స్వాముల శివనామ స్మరణతో కోట్ల ఆంజనేయ స్వామి ఆలయంలో పరమేశ్వరుడికి పంచామృతాలతో మహా రుద్రాభిషేకం బిల్వ పుష్పార్చన కార్యక్రమంలో భక్తి పరవశంతో పునీతులయ్యారు. అభిషేక బిల్వార్చన అనంతరం స్వామివారికి దీప ధూప నైవేద్యాలు సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మహా మండల శివస్వాములు భక్తులు తదితరులు పాల్గొన్నారు.