ఘనంగా ప్రారంభం అయిన రామడుగు ప్రీమియర్ లీగ్ సీజన్ 4

రామడుగు, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండల గడికోట మైదానంలో ఆర్పిఎల్ సీజన్ 4 క్రికెట్ టోర్నమెంట్ జనవరి 12రోజున ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈటోర్నమెంట్ మొదటి బహుమతి పూరెల్ల శేఖర్ పూరెల్ల అంజయ్య జ్ఞాపకార్థం పదివేల రూపాయలు, రెండవ బహుమతి తోట కృష్ణ, టోర్నమెంట్ బెస్ట్ బ్యాట్స్మెన్, బెస్ట్ బౌలర్ గుండి గ్రామానికి చెందిన ముంజాల ప్రవీణ్ గౌడ్ లు స్పాన్సర్స్ చేయడం జరిగిందని, ఈటోర్నమెంట్లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొననున్నాయని ఆర్గనైజర్స్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈకార్యక్రమంలో రామడుగు మాజీ వైస్ ఎంపీపీ పూరెల్ల గోపాల్ గౌడ్, గోపాలరావుపేట మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మరివేని తిరుమల తిరుపతి ముదిరాజ్, రామడుగు గ్రామ మాజీ సర్పంచ్ పంజాల జగన్మోహన్, సీనియర్ వాలీబాల్ ప్లేయర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పంజాల శ్రీనివాస్ గౌడ్, తిర్మలాపూర్ మాజీ ఎంపీటీసీ పెంచాల మల్లారెడ్డి, మాజీ వార్డు సభ్యులు మొయిజ్, ఆరిఫ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు అనుపురం పరశురామ్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మామిడి దిలీప్, కర్ణ శీను, నేరేళ్ళ మల్లేశం, అనిల్ మరియు ఆర్గనైజర్స్ పూరెల్ల మనోజ్ కుమార్ గౌడ్, బోదాసు తిరుపతి, నీలం చందు, సయ్యద్ ఫిరోజ్, ముంజల ప్రవీణ్ గౌడ్ ,కరుణాకర్, ఉత్తం మహేష్ ,రాజు, రామడుగు మండల క్రికెట్ ప్లేయర్స్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!