
చేర్యాల నేటిదాత్రి
చేర్యాల కోర్టు దగ్గర వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఎదురుగా ప్రముఖ న్యాయవాది పానుగంటి శ్రీనివాస్ ఆఫీస్ ను సిద్దిపేట బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జనార్దన్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు మిఠాయి తినిపిస్తూ శ్రీనివాస్ కు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా పానుగంటి శ్రీనివాస్ న్యాయవాది మాట్లాడుతూ గత 25 సంవత్సరాలు ఇక్కడి ప్రజలకు కక్షి దారులకు న్యాయ సలహాలు సూచనలు ఇస్తూ ఇక్కడి ప్రజల మన్ననలు పొందానని మరిన్ని సేవలు చేయుటకు ఇక్కడ ఆఫీస్ ఏర్పాటు చేశాను అన్నారు నోటరీ మరియు న్యాయ సలహాలు సూచనలు కొరకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సమాచార న్యాయవాదులు మరియు మిత్ర బృందం పాల్గొన్నారు