ఎస్పీ కిరణ్ ఖరే ఆధ్వర్యంలో లొంగుబాటు
సోమయ్య పై రూ. 8 లక్షల రివార్డు
లొంగిపోతే పునరావాసం కల్పిస్తామన్న. ఎస్పి కిరణ్ ఖరే
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఎదుట జిల్లా పోలీసు కార్యాలయంలో గత 32 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు మచ్చ సోమయ్య అలియాస్ సమ్మయ్య. సురేందర్. సతీష్, ఇంఛార్జి వ్యవసాయ విభాగం, సౌత్ బస్తర్ ఆఫ్ సీపీఐ మావోయిస్టు లొంగిపోయారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పి కిరణ్ ఖరే మాట్లాడుతూ మావోయిస్టు సోమయ్య సంధించిన వివరాలు వెల్లడించారు. మచ్చ సోమయ్య ఆడియో సమ్మయ్యగా తండ్రి పేరు వెంకటయ్య, వయస్సు: 62 సంవత్సరాలు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, భూపాలపల్లి మండలం, పంబాపూర్ గ్రామానికి చెందినవారు, జిల్లా కమిటీ సెక్రటరీ ర్యాంక్ ఇంచార్జ్ ఆఫ్ అగ్రికల్చరల్ వింగ్, సౌత్ బస్తర్ మావోయిస్టుగా పనిచేశారు ఎస్పీ తెలిపారు అనంతరం సోమయ్య పై ఉన్న రివార్డు 8 లక్షల రూపాయల చెక్కును అందించారు ఎవరైనా అజ్ఞాతంలో ఉంటే ఇప్పటికైనా జనజీవన స్రవంతిలో రావాలని ఎస్పీ పిలిపించారు ఈ కార్యక్రమంలో భూపాలపల్లి అదనపు ఎస్పీ బోనాల కిషన్, భూపాలపల్లి డీఎస్పీ ఏ. సంపత్ రావు, భూపాలపల్లి ఎస్సై దాసరి సుధాకర్ పాల్గొన్నారు.