నేలరోజులుగా రైతులకు అందని బోనస్..
రైతు భరోసా ఎగవేతకు సన్నాలకు బోనస్ తో కుట్ర చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం.
రైతులకు రుణమాఫీ,రైతూభరోసా,బోనస్ చెల్లించడంలో విఫలమైనా కాంగ్రెస్.
కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపాటు.
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
నర్సంపేట,నేటిధాత్రి :
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు, వరంగల్ రైతు డిక్లరేషన్ లో రైతులకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు రైతులను ఆదుకోవడంలో విఫలమైందన్నారు.రైతులు పండించిన అన్ని పంటలకు బోనస్ చెల్లిస్తామని చెప్పి చివరకు కేవలం వారికి సన్న రకాలకు మాత్రమే బోనస్ చెల్లిస్తామని వడ్లు కొనుగోలు చేసి నెలరోజులు గడిచిన రైతులకు ఇప్పటివరకు బోనస్ అందడం లేదన్నారు.కానీ రైతులకు ఇస్తామన్న బోనస్ ఎగవేతకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర సివిల్ సప్లై మాజీ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు.బోనస్ పేరుతో కాంగ్రేస్ ప్రభుత్వం రైతుల నెత్తిన కుచ్చుటోపీ పెట్టిందని ,సన్నాలకు బోగస్ గా బోనస్ అంటూ రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సున్నం పెట్టిందని ఎద్దేవా చేశారు.ఇప్పటి వరకు వరంగల్ ఉమ్మడి జిల్లాలో 33,958 మంది రైతులకు 85.24 కోట్ల రూపాయల బోనస్ డబ్బులు చెల్లించకపోవడం కాంగ్రేస్ ప్రభుత్వం దిగజారుడుతనానికి నిదర్శనం అని పేర్కొన్నారు.రైతు రుణమాఫీలో మోసం,రైతు భరోసా ఎగవేత,బోనస్ బోగస్ గా మారి ఈ కాంగ్రేస్ పాలనలో రైతన్న బ్రతుకును ఆగం అవుతుందని అవేదన వ్యక్తం చేశారు.నెలరోజులుగా బోనస్ కోసం పడిగాపులు కాస్తున్నా రైతులు పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పట్టింపులేదా అని ప్రశ్నించారు.రేవంత్ రెడ్డి సర్కారుకు రాజకీయ కక్షసాదింపు చర్యలు,పేదోళ్ళ ఇండ్ల కూల్చివేతలపై ఉన్న శ్రద్ద రైతులపై లేదని ఆరోపించారు.యాసంగి పంటకాలం ప్రారంభమై వ్యవసాయం పనులు చేసుకుంటుంటే వారికి పెట్టుబడి సాయం కిందా అందవలసిన రైతు భరోసా అనేక షరతులు విధించి రేపు మాపు అంటూ కాలయాపన చేస్తున్నారని అలాగే యూరియా కొరతా,కరెంటు కోతలు,రైతుబరోసా,బోనస్ అందక రైతులను గోసపెడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం,వ్యవసాయాన్ని నిర్లక్ష్య ధోరణితో గాలికి వదిలేసారని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు.