అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్‌స్పెక్టర్ మహమ్మద్ ఫారూఖ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం జగన్నాధపురంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో జాతీయ రోడ్డు భద్రత మాసోస్తవాలలో భాగంగా బుధవారం అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్‌స్పెక్టర్ మహమ్మద్ ఫారూఖ్ ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.విద్యార్థులకు రోడ్లపై ఎలా ప్రవర్తించాలో, పాఠశాలకు వెళ్లే సమయంలో రోడ్డు భద్రత గురించి సూచనలను అందించారు. రహదారి చిహ్నాల ప్రాముఖ్యతను తెలియజేసినారు.రోడ్డు భద్రతా జాగ్రత్తల గురించి వివరించి విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జి బాలు ఇతర ఉపాధ్యాయులు రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు