ఎమ్మెల్యే విజయుడుకు ఆశ కార్యకర్తల వినతిపత్రం అందజేత
అలంపూర్ / నేటి ధాత్రి.
తెలంగాణ రాష్ట్రంలోని ఆశ కార్యకర్తలకు ఫిక్సిడ్ వేతనం రూ.18 వేలు చెల్లించే విధంగా ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ సమావేశాలలో తమ సమస్యలను వినిపించి పరిష్కరించాలని ఆశ కార్యకర్తలు ఎమ్మెల్యే విజయుడుకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. అలంపూర్ నియోజకవర్గం లోని ఆశ కార్యకర్తలు అలంపూర్ చౌరస్తా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకుని వివిధ డిమాండ్ల తో కూడిన వినతి పత్రాన్ని ఎమ్మెల్యే విజయుడు కు అందజేశారు. ఆశ కార్యకర్తలు మాట్లాడుతూ.. ఏఎన్ఎం ట్రైనింగ్ పూర్తిచేసిన ఆశ కార్యకర్తలకు ఏఎన్ఎం ప్రమోషన్ ను కల్పించాలి. అదేవిధంగా ఈఎస్ఐ, పిఎఫ్ అమలు చేసే విధంగా చూడాలని ఎమ్మెల్యే విజయుడు ను ఆశా కార్యకర్తలు కోరారు. స్పందించిన ఎమ్మెల్యే విజయుడు ఆశా కార్యకర్తల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లి న్యాయం జరిగే విధంగా చూస్తానని ఎమ్మెల్యే ఆశా కార్యకర్తలకు హామీ ఇచ్చారు.