నల్లబెల్లి, నేటి ధాత్రి:
భారతీయ జనతా పార్టీ నూతన మండల అధ్యక్షుడిగా మండల కేంద్రానికి చెందిన తడక వినయ్ గౌడును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా వినయ్ మాట్లాడుతూ గతంలో పలు పదవులలో సమర్థవంతంగా పార్టీ బలోపేతానికి ఎంతగానో కృషి చేయగా రాష్ట్ర పార్టీ దాని గుర్తించి పార్టీ బలోపేతానికి నా వంతు సహకారం అందించే విధంగా నన్ను ప్రోత్సహించి ఇలాంటి పెద్ద బాధ్యతలు నాపై పెట్టినందుకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి , జిల్లా పార్టీ అధ్యక్షుడు గంటా రవికుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాణా ప్రతాప్ రెడ్డి గార్లకు నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా నాపై నమ్మకం ఉంచి నాకు సహకరించిన నల్లబెల్లి మండల క్రేశిల సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ ఆదేశాల మేరకు తూచా తప్పకుండా వ్యవహరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలపై ప్రజా తరఫున పార్టీ తరఫున వైఫల్యాను ఎండగట్టు రాబోయే స్థానిక సంస్థల్లో అత్యధిక మెజార్టీ స్థానాల్లో కాశాయ జండం ఎగిరేవడమే నా ధ్యేయం దానికి ప్రతి కార్యకర్త నాకు అండదండగా ఉండాలని ఆయన అన్నారు.