కామారెడ్డి జిల్లా ప్రతినిధి నేటి ధాత్రి:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ సూచన మేరకు గురువారం నాడు కామారెడ్డి పట్టణంలోని 4వ, వార్డులో కబురస్థాన్ (స్మశాన వాటిక)లోని పిచ్చి మొక్కల సమస్య ఉంది అని కౌన్సిలర్ చైర్ పర్సన్ దృష్టికి తీసుకురావడం వల్ల వెంటనే స్పందించి పిచ్చి మొక్కలను మున్సిపల్ అధికారులతో వెళ్లి దగ్గరుండి శుభ్రం చేయించారు. ఈ కార్యక్రమంలో, వార్డు కౌన్సిలర్ పిడుగు మమత సాయిబాబా, చోట్ల వంశీ,తయాబ సుల్తానా సలీం, ఇమ్రాన్ లడ్డు, పాల్గొన్నారు