చిల్పూర్,(జనగాం)నేటి ధాత్రి
చిల్పూర్ మండల కేంద్రంలోని శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయం దిన దిన అభివృద్ధి చెందుతూ భక్తులు కోరుకున్న కోరికలు నెరవేర్చుతూ నలుమూలల వెలుగొందుతున్న
శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని ప్రత్యేక పూజలు అర్చనలతోపాటు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం జరుగుతుందని ఆలయ
కార్యనిర్వహణ అధికారి
లక్ష్మి ప్రసన్న తెలిపారు.ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని భగవంతుని కృపకు పాత్రులు కావాలని కోరారు. ఇందులో భాగంగా వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రధాన అర్చకులు రంగాచార్యులు,రవీందర్ శర్మ, కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారని ఆలయ నిర్వహకులు తెలిపారు.
నేడు శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి వారి ఉత్తర ద్వార దర్శనం
