నవాబుపేట /నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలంలోని కొల్లూరు గ్రామంలో గురువారం జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి కొల్లూరు ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను బ్యాటింగ్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. కాసేపు బ్యాటింగ్ చేస్తూ.. క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ.. ఆటలలో గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు, క్రీడాకారులు పాల్గొన్నారు.