నర్సంపేట,నేటిధాత్రి :
జాతీయ యువజన పురస్కార గ్రహీత రాజ్ కుమార్ కు బుధవారం గణ సత్కారం జరిగింది.గత 25 సంవత్సరాల నుండి సామజిక సేవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాలలో జరిగే సదస్సులకు హాజరవుతూ భారత దేశ ఖ్యాతిని ఖండాంతరాలలో ఇనుమడింప చేస్తున్న జాతీయ యువజన పురస్కార గ్రహీత గుజ్జుల రాజ్ కుమార్ ను స్మిత సబర్వాల్ ఘనంగా సత్కరించారు. తెలంగాణ రాష్ట్ర యువజన సేవల శాఖా అద్వర్యంలో రాష్ట్ర యువజన మహోత్సవం కార్యక్రమం సికింద్రాబాద్ లోని యూత్ హాస్టల్ ప్రాంగణం బోట్స్ క్లబ్ వద్ద గణంగా నిర్వహించగా ముఖ్య అతిధిగా హాజరైన యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక శాఖా ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి స్మిత సబర్వాల్, పురస్కార గ్రహీత గుజ్జుల రాజ్ కుమార్ ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన సేవల శాఖా డైరెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల యువజన ప్రతినిధిలు పాల్గొన్నారు.
జాతీయ పురస్కార గ్రహీత రాజ్ కుమార్ కు గణసత్కారం
