మాజీ సొసైటీ ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి
ఇరిగేషన్ శాఖ అధికారులు వెంటనే స్పందించాలి
80 లక్షల రూపాయల నిధులతో టెండర్
జులై నెలలో కురిసిన భారీ వర్షాలకు కర్కపల్లి లో పూర్తిగా దెబ్బతిన్న కుంటలను వెంటనే పనులు ప్రారంభించాలి
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలో ని కర్కపల్లి గ్రామంలో జిల్లాలో 2023 జులై నెలలో కురిసిన భారీ వర్షాలకు కర్కపల్లిలో పూర్తిగా దెబ్బతిన్న సబ్బిడికుంట (ఉడుగుల కుంట) పనులను ప్రారంభించాలని గణపురం మాజీ సొసైటీ ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు
సబ్బిడీకుంట కొట్టుకపోయి 20 నెలలు అవుతోంది, గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు నిధులు కేటాయించిన ఇప్పటివరకు వరకు మరమత్తులు చేయకపోవడం విడ్డురమని, రైతులపై ప్రభుత్వం ఇంత చిన్నచూపు సరికాదని, సుమారు 80 లక్షల రూపాయల నిధులతో టెండర్ అయినప్పటికి పనులు ప్రారంభించడంలో జాప్యం చేస్తున్నారని, ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు, ఇరిగేషన్ శాఖ అధికారులు స్పందించి వెంటనే పనులు ప్రారంభించాలని ఆయన అన్నారు
లేని పక్షంలో రైతుల పక్షాన ధర్నా కార్యక్రమం చేపడతామని వారు అన్నారు