
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
మండల పరిషత్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
గంగాధర నేటిధాత్రి :
కల్యాణ లక్ష్మితో పేద, మధ్యతరగతి కుటుంబాల్లోని అమ్మాయిల వివాహానికి భరోసా కల్పిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.గంగాధర మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 36 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి కింద ఆర్థిక సహాయం మంజూరు అయింది.గంగాధర మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. కల్యాణ లక్ష్మి అందజేసిన ఎమ్మెల్యేకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.