
అలంపూర్ / నేటి ధాత్రి
అలంపూర్ నియోజకవర్గంలోని రైతులు ఆర్డీఎస్, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ద్వారా సాగు చేస్తున్న రెండవ పంటలు.. తుంగభద్ర నదిలో నీటిమట్టం తగ్గిపోవడంతో ఎండిపోతున్నాయి. దీంతో రైతులు ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి దృష్టికి తీసుకురావడంతో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు తుంగభద్ర డ్యాం అధికారులతో, ఆర్డీఎస్ అధికారులతో మాట్లాడి ఆర్డీఎస్ రెండో ఇండెంట్ లో భాగంగా.. 1టిఎంసి నీటిని విడుదల చేయాలని అధికారులను కోరారు. స్పందించిన అధికారులు తుంగభద్ర డ్యాం నుండి బుధవారం నీటిని విడుదల చేశారు. మరో మూడు రోజుల్లో ఆర్డీఎస్,తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం వరకు సాగునీరు వచ్చే అవకాశం ఉన్నదనీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇరిగేషన్ శాఖ అధికారులతో ఎమ్మెల్యే విజయుడు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి గారు బుధవారం ఫోన్లో మాట్లాడి తుంగభద్ర డ్యామ్ నుండి ఏపీకి రావాల్సిన రెండవ ఇండెంట్ సాగునీటి విడుదలకు ప్రతిపాదనలు తుంగభద్ర డ్యామ్ అధికారులకు పెట్టాలని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అధికారులను కోరారు. స్పందించిన అధికారులు ఏపీకి రావాల్సిన సాగునీటి విడుదలకై తుంగభద్ర డ్యామ్ కు ఇండెంట్ పంపుతున్నట్లు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే అధికారులు విన్నవించారు. రైతులు సాగు చేస్తున్న పంటలు ఎండిపోతున్నాయని అధైర్య పడవద్దని సకాలంలో సాగునీరు విడుదలవుతుందని ఎమ్మెల్సీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. సకాలంలో సాగునీటిని విడుదల చేయించిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేకు అలంపూర్ నియోజకవర్గ రైతులు కృతజ్ఞతలు తెలిపారు.