
నర్సంపేట,నేటిధాత్రి:
ఇందిరా మహిళా శక్తి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద మంజూరైన సంచార చేపల అమ్మకం వాహనాన్ని ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ప్రారంభించారు. మంగళవారం నర్సంపేట తన క్యాంప్ కార్యాలయం ముందు సంచార చేపల అమ్మకం వాహనం ను ప్రారంభించిన అనంతరం దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ
ఇందిరా మహిళా శక్తి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద మంజూరైన యూనిట్ ను స్థాపించి ఆర్థికంగా ఎదగాలని ఎమ్మెల్యే అన్నారు. మంగళవారం నర్సంపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ముందు సంచార చేపల వాహనాన్ని ప్రారంభించిన అనంతరం దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి పథకం కింద పది లక్షల రూపాయలతో వాహనాన్ని నర్సంపేట మండలం మాదన్నపేట గ్రామం స్వయం సహాయక సంఘం సభ్యురాలు దొంతర బోయిన స్వాతికి మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇందులో సభ్యురాలు వాటాదనం నాలుగు లక్షల కాగా 6 లక్షల రూపాయలు సబ్సిడీ మంజూరి చేయడం జరిగిందని తెలిపారు. సంచార చేపల అమ్మకం వ్యాపారం నిమిత్తం శిక్షణలో ఐదు రోజులపాటు హైదరాబాదులో శిక్షణ తీసుకున్నదని పేర్కొన్నారు.ఈ వ్యాపారంలో మంచి రుచిగల కొత్త వంటకాలు తయారుచేసి వ్యాపారం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. చేపల సరఫరా కోసం మత్స్యశాఖ అధికారుల సహకారం పొందాలని చేపల సరఫరా చేసే వారితో టైప్ చేసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారు దొంతరపోయిన స్వాతి మాట్లాడుతూ ఇంటిలో తయారు చేసే వంటల మాదిరిగా చాలా రుచికరంగా రసాయనాలు లేని వంటకాలు తయారు చేసి అమ్మకాలు చేపడతామని తెలిపారు. ఇతర ప్రాంతాలలో అమ్మకాలు జరిపే విధంగా సంచార వాహనాలు ప్రభుత్వం ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. వ్యాపారంలో మహిళలు ఆర్థికంగా రాణించాలని మరికొందరికి ఆదర్శంగా నిలవాలని ఎమ్మెల్యే సూచించారాన్నారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్,వరంగల్ జిల్లా డిఆర్డిఏ సెర్ఫ్ డిఆర్డిఓ కౌసల్యా దేవి,జిల్లా ఫిషరీస్ ఆఫీసర్ సత్య నాగమణి, డిఆర్ఓ విజయలక్ష్మి,ఎపిడి రేణుకా దేవి, నర్సంపేట కౌన్సిలర్స్,నర్సంపేట సర్ప్ ఎపిఎం మహేందర్, ఎపిఎం గీత రాణి,ఎంఎస్ పాలకవర్గ సభ్యులు అధ్యక్షులు వీణ,శ్వేత కవిత సీసీ లు శోభారాణి వనమ్మ మహేందర్, ఎంఎస్ఏ రవి, మాదన్నపేట వివో సభ్యులు, వివోఏ శ్రీను తదితరులు పాల్గొన్నారు.