
దాతలను సన్మానించిన ఉపాధ్యాయులు
గంగాధర నేటిధాత్రి :
మండలంలోని గర్శకుర్తి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల లో విద్యార్థుల అవసర నిమిత్తం సౌండ్ సిస్టం కొనుగోలుకు రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు కంకణాల కిషన్ రెడ్డి, చిందం ఆంజనేయులు, కత్తి శంకర్ గౌడ్ కలిసి 28 వేల రూపాయలను విరాళంగా అందించారు. ఉధార స్వభావంతో విద్యార్థుల అవసర నిమిత్తం పాఠశాలకు విరాళం అందించిన దాతలను పాఠశాల ఉపాధ్యాయులు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించి, వారి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల హెచ్ఎంలు శశికాంత్ రెడ్డి, కృష్ణవేణి, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.