
మరిపెడ నేటిధాత్రి.
మహవిష్ణువుకు ప్రీతి పాత్రమైన ధనుర్మాసం పురస్కరించుకుని మున్సిపల్ కేంద్రంలోని సుప్రసిద్ధమైన మాకుల శ్రీ వేంకటేశ్వర ఆలయంలో లక్ష తులసి దళాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు నల్లన్ చక్రవర్తుల లక్ష్మి నరసింహా చార్యులు, పఖాల రఘురాం శర్మ ఆధ్వర్యంలో శ్రీ గోదాదేవి రంగనాథులకు ప్రత్యేక పూజలు లక్ష పుష్ప, తులసి అర్చన చేశారు. అనంతరం భక్తులు సామూహిక విష్ణు సహస్ర నామ స్తోత్రం, సౌందర్యలహరి పారాయణం తో పాటు గోవిందా నామాలు, హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. కార్యక్రమంలో మరిపెడ తో పాటు వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. నిష్కల్మషమైన మనస్సు తో కొలిచి కోరినంతనే భక్తి మాత్రం చేత స్వామి లో లీనమైన గోదాదేవి నేటి తరానికి మార్గదర్శి గా నిలిచిందని అర్చకులు తెలిపారు.