చేర్యాల జేఏసీ చైర్మన్ ఒకలాభరణం నరసయ్య పంతులు
చేర్యాల నేటిధాత్రి
చేర్యాల రెవెన్యూ డివిజన్ కొరకు గత ఎనిమిది సంవత్సరాలుగా ఉద్యమం చేస్తున్నారని జేఏసీ చైర్మన్ వక్లాభరణం నరసయ్య పంతులు అన్నారు అయినను ఇంకా రెవెన్యూ డివిజన్ రాకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా చేర్యాల అఖిలపక్షం ఆధ్వర్యంలో జేఏసీ గా ఏర్పడి నరసయ్య పంతులు చేర్యాల అంబేద్కర్ సర్కిల్ దగ్గర నుండి ర్యాలీగా వెళ్లి సిద్దిపేట కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చారు చేర్యాల రెవెన్యూ డివిజన్ ప్రజల ఆకాంక్షాన్ని దీన్ని ప్రభుత్వాలు మభ్యపెడుతున్నారని అన్నారు చేర్యాల ప్రాంతం ఒక్కొక్క ఆఫీసుకు ఒక ప్లేస్ కు పోవడం వలన ప్రజలు ఇబ్బందుల పడుతున్నారని ఈ ప్రాంత సమస్య పై ఎన్నికలలో హామీ ఇచ్చారని ఆయనను ఇంకా ప్రభుత్వం మీనమేషాలు లెక్కబెడుతూ కాలయాపన చేస్తున్నారని దుయ్యబట్టారు ఈ కార్యక్రమంలో చేర్యాల మున్సిపల్ చైర్ పర్సన్ అంకుగారి స్వరూప రాణి బిజెపి నుండి బూరుగు సురేష్ గౌడ్ బిఆర్ఎస్ నుండి ముస్తల బాల నర్సయ్య తెలుగుదేశం నుండి ఒగ్గు రాజు మరియు సిపిఎం నాయకులు మరియు అఖిలపక్ష నాయకులు పూర్మ వెంకట్ రెడ్డి మేక సంతోష్ కొంగరి వెంకట్ మావో పెద్ద ఎత్తున అఖిలపక్ష కార్యకర్తలు పాల్గొన్నారు