మహబూబ్ నగర్ /నేటి ధాత్రి.
మహబూబ్ నగర్ పట్టణంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల బృందం సోమవారం ప్రశాంత్ హోటల్లో నాణ్యత ప్రమాణాలను పాటిస్తున్నారా? లేదా ? తనిఖీలో భాగంగా,..చికెన్ బిర్యాని, ముడి పదార్థాలను పరీక్షల కోసం సేకరించారు. వీటిని నాణ్యత ప్రమాణాల కోసం స్టేట్ ఫుడ్ లాబరేటరీ పంపించడం జరుగుతుందని ఫుడ్ ఇన్స్పెక్టర్ తెలిపారు. ఏమైనా కల్తీ నిర్ధారణ జరిగితే చట్టపరంగా.. చర్యలు తీసుకుంటామన్నారు. హోటల్లో అపరిశుభ్ర వాతావరణము ఉన్నందున నోటీసు జారీ చేశారు. ఈ సంఘటనపై కేసు రిజిస్టర్ చేశారు. ఈ తనిఖీలలో అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ విజయ్ కుమార్, జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్, మనోజ్ కుమార్, శ్రీలత, ఇంచార్జ్ ఆఫీసర్ కరుణాకర్, అంజలయ్య ఆఫీస్ సబార్డినేట్ ఉన్నారు.