ఐదవ వార్డ్ కౌన్సిలర్ జిలకర మహేష్
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఐదవ వార్డ్ అమరవాది లో గల అమరవాది మంచిర్యాల రహదారి సమీపంలోని వాగు వద్ద మినీ ట్యాంక్ బండ్, బతుకమ్మ ఘాట్ ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం క్యాతనపల్లి మునిసిపాలిటీ చైర్ పర్సన్ జంగం కళ, కమిషనర్ గద్దె రాజుకు స్థానిక ఐదవ వార్డు కౌన్సిలర్ జిలకర మహేష్ వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. వినతి పత్రం అందించిన నేపథ్యంలో చైర్పర్సన్, కమిషనర్ లు స్పందించి మినీ ట్యాంక్ బండ్, బతుకమ్మ ఘాట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపిస్తామని తెలిపినట్లు పేర్కొన్నారు.