వెల్దండ/నేటి ధాత్రి
నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని రాచూరు గ్రామానికి 8 కిలోమీటర్లు మట్టి రోడ్డు ఉంది. దీంతో రాచూరు గ్రామం నుండి వెల్దండ మండల కేంద్రానికి వెళ్లాలంటే వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత BRS ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉండి బీటీ రోడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చి నెరవేర్చ లేదన్నారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు బీటీ రోడ్డు వేయనీయకుండా అడ్డుకుంటున్నారన్నారు. మట్టి రోడ్డును బీటీ రోడ్డుగా మార్చాలని సోమవారం తహసిల్దార్ కార్తీక్ కుమార్ కు బిజెపి పార్టీ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల బీజేవైఎం ఉపాధ్యక్షుడు బెక్కరి సురేష్ రెడ్డి, శివశంకర్, ప్రేమ్ కుమార్, సుభాష్ గౌడ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.