నూతన విద్యుత్ సబ్ స్టేషన్ లకు శంకుస్థాపన.

ముఖ్య అతిథిగా హాజరైన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.

⏩ భూమిలేని వ్యవసాయ కుటుంబాలు,కూలీలకు ప్రతి సంవత్సరం రూ.12 వేల రూపాయలు.

⏩అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్దే ధ్యేయంగా తెలంగాణ ప్రజా ప్రభుత్వం.

⏩ ఏడాది కాలంలోనే రైతు రుణమాఫీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.

కాశిబుగ్గ నేటిధాత్రి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలంలోనే ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతున్నదని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు.ఆదివారం గీసుకొండ మండలం మొగిలిచర్ల గ్రామంలో రూ 8 కోట్ల 32లక్షలతో నిర్మించే మూడు(మొగిలిచర్ల,గొర్రెకుంట గరీబ్ నగర్ ,విశ్వనాధపురం) 33/11 కెవి విద్యుత్ సబ్ స్టేషన్ లకు ఆదివారం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి తో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. అంతకముందు రెడ్డిపాలెం సర్కిల్ వద్ద ఘనంగా స్వాగతంతో భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటుచేసిన సభలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ పరకాల శాసనసభ్యులు సీనియర్ శాసన సభ్యుడైనప్పటికీ నిత్యం తన నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధుల కోసం పోరాడుతో ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అని అన్నారు.పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి కోరిన నిధులను తప్పకుండా మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని అన్నారు.ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపే ఆర్థిక పరంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైన, ఇచ్చిన వాగ్దానాలను నిబద్ధతతో 22 వేల కోట్ల రూపాయల మేర 2 లక్షల లోపు రుణాలను నేరుగా రైతుల ఖాతాలో పంపించి మాఫీ చేయడం జరిగిందన్నారు.సాంకేతిక కారణాలవల్ల రుణమాఫీ కానీ వారి ఇంటింటికి సర్వే చేసి మిగిలిన వారికి కూడా రుణమాఫీ చేశామన్నారు. సంక్రాంతి నుండి ప్రతి ఎకరాకు రైతు భరోసా అందిస్తామన్నారు.భూమిలేని వ్యవసాయ కుటుంబాల కూలీలకు ప్రతి సంవత్సరం 12 వేల రూపాయల ఇందిరమ్మ ఆత్మ భరోసా క్రింద జనవరి 26 నుండి ప్రారంభిస్తామన్నారు.
కుల,మతాలకతీతంగా అన్ని వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించుటకు ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ లను ఏర్పాటు చేస్తామన్నారు.

⏩ పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ

ఇప్పటివరకు పరకాల నియోజకవర్గంలో సుమారు 400 కోట్ల 79 లక్షల రూపాయల నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుండి మంజూరు చేయడం జరిగిందని, మరో 107 కోట్లు మంజూరయ్యే ప్రతిపాదనలో ఉన్నాయన్నారు.రైతు రుణమాఫీ ద్వారా 26994 మంది రైతులకు 221 కోట్ల 27 లక్షల 64 వేల రూపాయల రైతు రుణమాఫీ జరిగిందని వెల్లడించారు. అలాగే సీఎంఆర్ఎఫ్ నుండి 1092 మంది లబ్ధిదారులకు 4 కోట్ల 42 లక్షల 65 వేల రూపాయల్లో చెక్కులను పంపిణీ చేశామన్నారు.కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకం ద్వారా 1483 మంది లబ్ధిదారులకు 14 కోట్ల,84 లక్షల,72 వేల 28 రూపాయల చెక్కులను పంపిణీ చేసామన్నారు,రైతు బీమా ద్వారా 142 మంది రైతులకు 7 కోట్ల పది లక్షలు ఇచ్చామన్నారు.కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు ముఖ్యమంత్రి రేవంత్ ను ఆహ్వానించి భూమి కోల్పోయిన రైతులకు 100 గజాల స్థలం ఇవ్వాలని కోరగా, ఇటీవల 863 మంది కి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరిగిందన్నారు.863 ఇండ్లకు గాను 43 కోట్ల 51 లక్షల రూపాయలు,నాలాల అభివృద్ధి కోసం 169 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించడం జరిగిందన్నారు.
నియోజకవర్గం లో మినీ ఇండస్ట్రీ పార్కులు ఏర్పాటు చేయబోతున్నామని, మండలానికి ఒకటి చొప్పున సోలార్ పవర్ ప్లాంట్ లు ఏర్పాటుకు ప్రతి పదనలు చేస్తున్నామని అన్నారు.నిరుద్యోగ,యువతీ యువకులకు త్వరలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.నడికూడ మండలంలో వేర్హౌస్ కార్పొరేషన్ నుండి వ్యవసాయ ఉత్పత్తిలో నిలువ చేసుకునే నిమిత్తం గోదాంలు ఏర్పాటు చేయబోతున్నామన్నారు. పరకాల మున్సిపాలిటీ అభివృద్ధి పనుల కోసం 45 కోట్లతో డిపిఆర్ తయారు చేసామని అన్నారు.ఇందులో భాగంగా టి యు ఎఫ్ ఐ డీసీ ద్వారా 15 కోట్లు కేటాయింపు చేశాను, పాత నిధులు 9 కోట్లు ఉన్నాయని అన్నారు.మరో 20 కోట్లు సింగరేణి,కోల్ టీఎస్ జెన్కో నిధుల నుండి ఇప్పించి సహకరించాలని కోరారు.అదే విధంగా అక్కంపేట గ్రామం రెవెన్యూ గ్రామం గా డేస్ తెలంగాణo9 రాజ పత్రం సంఖ్య 160/G తేదీ 15 మార్చ్ 2024 రోజున గెజిట్ రావడం జరిగిందని, ఈరోజు గ్రామ ప్రజలకు రాజ పత్రాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ డాక్టర్ రాంచంద్రు నాయక్, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య,వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, గ్రేటర్ వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి,ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ,ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కె ఆర్ నాగరాజు,గండ్ర సత్యనారాయణ రావు, కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి,జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా, జిడబ్ల్యూ ఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాఖేడే,ఎన్పిడిసిఎల్ ఎం డి వరుణ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!