రిలీజ్ కు సిద్ధం.

మమత ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఆమని ప్రధాన పాత్రలో

శ్రీమతి మమత సమర్పించు చిత్రం ‘బ్రహ్మాండ’

“నేటిధాత్రి” ఫిలింనగర్


చిత్ర సహనిర్మాత శ్రీమతి దాసరి మమత మాట్లాడుతూ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఫైనల్ మిక్సింగ్ జరుపుకుంటుంది. త్వరలోనే ఆడియోను రిలీజ్ చేస్తామని చెప్పారు,
నిర్మాత దాసరి సురేష్ మాట్లాడుతూ స్క్రిప్ట్ దశలో మేము అనుకున్నది అనుకున్నట్టుగా .. అంతకుమించి చిత్రీకరించాడు మా దర్శకుడు రాంబాబు గారు ఇప్పటివరకు ఎవరు చూడని చత్తీస్గడ్ మరియు కర్ణాటక లొకేషన్ లలో సినిమా ను చిత్రీకరించాం ముఖ్యంగా ఆమని గారు బలగం జయరాం గారు కొమురక్క గార్ల సహకారం మేము మరవలేము అని చెప్పారు . ఆడియో రిలీజ్ అవ్వగానే సినిమా విడుదల చేస్తామని అన్నారు .


చిత్ర దర్శకుడు రాంబాబు మాట్లాడుతూ తెలుగు సినిమా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒగ్గు కళాకారుల నేపథ్యంలో వారి సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్న చిత్రం ఇది. ఒగ్గు కథ తెలంగాణ జానపద కళారూపం. ఒగ్గు అంటే శివుని చేతిలోని ఢమరుకం అని అర్ధం. ఈ పదం కేవలం తెలంగాణ ప్రాంతంలోనే వినిపిస్తుంది. ఇది అచ్చమైన దేశీపదం. ఈ చిత్రకథ మరియు స్క్రీన్ ప్లే ప్రేక్షకులను తప్పకుండా రంజింప చేస్తుంది. యాక్షన్స్ అన్ని మరియు డివోషనల్ థ్రిల్లింగ్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చే విధంగా ఉంటాయి.
నటీనటులు :
ఆమని బలగం జయరాం కొమరక్క బన్నీ రాజు, కనీకావాధ్వ చత్రపతి శేఖర్ అమిత్, దిల్ రమేష్ ప్రసన్నకుమార్ దేవిశ్రీ కర్తానందం తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

నిర్మాత : దాసరి సురేష్
సహా నిర్మాత శ్రీమతి దాసరి మమత
కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం :రాంబాబు
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : కాసుల కార్తీక్
ఎడిటింగ్ : ఎమ్మార్ వర్మ
సంగీతం : వరికుప్పల యాదగిరి
మాటలు : రమేష్ రాయి జి ఎస్ నారాయణ
కొరియోగ్రఫీ :కళాధర్ రాజు ,రాజు కోనేటి(SDC) ,కిరణ్.
పీ ఆర్వో : శ్రీపాల్ చోల్లేటి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!