సిపిఐ పట్టణ కార్యదర్శి సోత్కు ప్రవీణ్ కుమార్
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి పట్టణంలోని స్థానిక రావి నారాయణరెడ్డి భవన్ లో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు కేకును కట్ చేసి మిఠాయిలు పంచుకోవడం జరిగింది. అనంతరం సిపిఐ పట్టణ కార్యదర్శి సోత్కు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ 2025కొత్త సంవత్సరం అందరికి మంచి జరగాలని కోరారు.
ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 100 సంవత్సరాల ఆవిర్భావ వేడుకలను జనవరి 25వ తేదీన నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.సిపిఐ పార్టీ పార్టీ ఆవిర్భా వేడుకలను జయప్రదం చేయాలని ప్రవీణ్ కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు క్యాతరాజు సతీష్,గోనెల తిరుపతి, పీక రవి, యాకుబ్ పాషా, కాంతారావు,రాజేష్,కృష్ణ, పొనగంటి లావణ్య, రజిత శ్రీలత సంధ్య వాసం రజిత తదితరులు పాల్గొన్నారు.