
పిఆర్టీయూ మరిపెడ మండల అధ్యక్షులు కీసర రమేష్ రెడ్డి
మరిపెడ నేటిధాత్రి.
సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని అందరిని రెగ్యులరైజ్ చేయాలని పిఆర్టీయూ మరిపెడ మండల అధ్యక్షులు కీసర రమేష్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహబూబాద్ జిల్లా కేంద్రంలో గత 25 రోజులుగా సమగ్ర శిక్షా ఉద్యోగులు నిర్వహిస్తున్న నిరవధిక దీక్షా శిబిరాన్ని సందర్శించి ఆయన మాట్లాడుతూ గత 13 సంవత్సరాలుగా చాలిచాలని వేతనాలతో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులందరిని రెగ్యులరైజ్ చేసి,ఈ సమ్మె విరమించడానికి ప్రభుత్వం వెంటనే వారితో చర్చలు జరపాలని కోరారు. ఉపాధ్యాయినీలను అక్రమంగా డెప్యుటేషన్ పై కెజిబివి లకు పంపడాన్ని తీవ్రంగా ఖండించారు.సమగ్ర శిక్ష ఉద్యోగుల ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడం సరికాదన్నారు.మండలంలోని ఉపాధ్యాయులు కూడా నిరవధిక సమ్మె చేస్తున్న ఉద్యోగులకు మద్దతుగా నిలిచి వారి పాఠశాలలకు ఎవరు కూడా వెళ్ళకుండా సహకరించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పిఆర్టీయూ మరిపెడ మండల ప్రధాన కార్యదర్శి లింగాల మహేష్ గౌడ్,సిఆర్పీలు రవీందర్,హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.