మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు…
డిజే బాక్సులు వినియోగిస్తే ఉపేక్షించేది లేదు..
ఆర్కేపీ ఎస్ఐ జి రాజశేఖర్
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
నూతన సంవత్సర వేడుకలు సంతోషాలనేపద్యంలో నిర్వహించుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ తరపున భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని రామకృష్ణాపూర్ పట్టణ ఎస్ఐ జి రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజశేఖర్ మాట్లాడుతూ…. నేడు డిసెంబర్ చివరి రోజు కావడంతో నూతన సంవత్సర ఉత్సాహంతో మద్యం సేవించి వాహనాలు నడిపినా సరే మైనర్లు వాహనాలు నడిపినా సరే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా డీజీలు వినియోగిస్తే సీజ్ చేస్తామని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రభుత్వ స్థలాల్లో మద్యం సేవిస్తే కేసులు నమోదు చేస్తామని అన్నారు. నిషేధిత డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలు వినియోగిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ర్యాష్ డ్రైవింగ్, బైక్ రేసింగ్, త్రిబుల్ రైడింగ్, శబ్ద కాలుష్యం చేస్తూ వాహనాలు నడుపుతే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.