`సీడబ్ల్యుసీ అనుమతి లేఖ తిప్పిపంపడంతో సమస్య మొదటికి
`కాంగ్రెస్ తొలి ప్రాధాన్య ప్రాజెక్టు పాలమూరు
`కృష్ణా జలాల వివాదం పరిష్కారం కాకపోవడమే కారణం
`12.3లక్షల ఎకరాలకు నీరు, 1200 గ్రామాలకు తాగునీరు అందించడం లక్ష్యం
`ప్రాజెక్టుపై పెట్టిన ఇన్నివేల కోట్లు వృధాకావల్సిందేనా?
`దీనిపై రేవంత్ సర్కార్ స్పందన ఏంటో?
`పరిహారం అందక చాలా ముంపు గ్రామాల ప్రజల్లో అసంతృప్తి
`పెండిరగ్ బిల్లులు, పెరుగుతున్న ప్రాజెక్టు వ్యయం మరో తలపోటు
హైదరాబాద్,నేటిధాత్రి:
ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గండ జిల్లాలకు ప్రయోజనం కలిగించే పాలమూరుా రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి నీటి కేటాయింపులపై డీపీఆర్‌ను కేంద్రజల సంఘం తిప్పి పంపడంతో ప్రాజెక్టుపై నీలినీడలు ముసుకున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్టును నిర్మించడంలో పర్యావరణపరమైన జాగ్రత్తలేవీ తీసుకోకుండా, తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ నేషనల్ గ్రీన్ ట్రి బ్యునల్ పర్యావరణ పరిహారంగా రూ.528 కోట్లు చెల్లించాలని, తమ ఆదేశాలను ఉల్లంఘించి నందుకు రూ.300 కోట్లు జరిమానాగా చెల్లించాలని గతంలో ఆదేశించింది. అయితే దీనిపై తె లంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్టే తెచ్చుకుంది. అయితే కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖకుచెందిన నిపుణుల కమిటీ (ఈఏసీ) షరతులతో పర్యావరణ అనుమతులు జారీచేయవచ్చని సిఫా రసు చేసినా ఎన్జీటీ దానికి అనుమతించడంలేదు. అయితే రూ.153కోట్లతో పర్యావరణ పునరు ద్ధరణ పనులు చేపట్టి, బాధ్యులైన అధికార్లపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్జీటీ ఆదేశించింది. అయితే తీవ్రమైన పర్యావరణ ఉల్లంఘనలు ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడానికి ససేమిరా అంటోంది.
ఈ ప్రాజెక్టుకు మొత్తం ఆరు రిజర్వాయర్లుండగా ఇందులో ఒకటైన ఉద్దండాపూర్ రిజర్వాయర్ పరిధిలోని గ్రామాలకు చెందిన ప్రజలు అడ్డుకోవడం అడ్డుకోవడంలో దీని పనులు 2023 నవంబర్ నుంచే నిలిచిపోయాయి. వీరు తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. నిజానికి ప్రభుత్వం ఈ ఆరు రిజర్వాయిర్లలో కేవలం ఐదింటిలోనే పనులు ప్రారంభించింది. మరోదాన్ని ప్రత్యామ్నాయ మార్గం ద్వారా ఆయకట్టుకు నీరందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ‘పాలమూరు`రంగారెడ్డి’ ఎత్తిపోతల పథకానికి ప్రాధాన్యత ఇచ్చి ఏటా రూ.6వేల కోట్ల వ్యయంతో వచ్చే నాలుగేళ్లలో దీన్ని పూర్తిచేయాలని ల క్ష్యంగా పెట్టుకున్నా ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ప్రాజెక్టు ముందుకెళ్లే పరిస్థితి కనిపించడంలేదు. శ్రీశైలం జలాశయం నుంచి 90 టీఎంసీల వరద నీటిని 60 రోజులపాటు తరలించి నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నారాయణపేట, రంగారెడ్డి, వికారాబాద్, నల్గండ జిల్లాల్లో 12.3లక్షల ఎకరాలకు సాగునీరు, 1200 గ్రామాలకు తాగునీరందించడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. 2015, జూన్ 10వ తేదీన నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.35,200 కోట్ల అంచనాలతో ఈ ప్రాజెక్టుకు అనుమతులు జారీచేసింది. ఈ ప్రాజెక్టు తొలిదశలో శ్రీశైలం నుంచి, అంజనగిరి రిజర్వాయర్‌కు విజయవంతంగా నీటిని పంపింగ్ చేయగలిగారు. అయితే అంతలోనే అప్పట్లో అ సెంబ్లీ ఎన్నికలు రావడంతో ఈ ప్రాజెక్టుకు సంబంధించి మిగతా మంజూరులు ఎన్నికల నియమావళి కారణంగా నిలిచిపోయాయి. గ్రామాలకు తాగునీరు అందించే అంశంపై వచ్చిన లీగల్ అడ్డంకులను అధిగమించినా ప్రాజెక్టు ముందుకు సాగడంలేదు. ఇప్పుడు ప్రాజెక్టు అంచనా వ్య యం ఏకంగా రూ.58086 కోట్లకు చేరుకుంది. ఈ ప్రాజెక్టుపై గత ప్రభుత్వం రూ.31,423 కోట్లు ఖర్చు చేసి 85% పను లు పూర్తిచేసినా తాజా పరిణామాల నేపథ్యంలో ప్రాజెక్టు నీరుగారిపోయే పరిస్థితి ఏర్పడిరది.
ముఖ్యంగా కేంద్రజలసంఘం కొర్రులు పెడుతుండటంతో 2027 నాటికి ప్రాజెక్టును పూర్తి చే యాలని పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా కనిపించడంలేదు. డిసెంబర్ 19న కేంద్ర జలసంఘం రాష్ట్ర నీటిపారుదల శాఖకు ఒక లేఖ రాసింది. పీఆర్‌ఎల్‌ఐఎస్ ప్రాజెక్టుకు సంబం ధించిని ప్రాజెక్టు రిపోర్టును తిప్పిపంపుతూ, అనుమతుల జాబితానుంచి దీన్ని తొలగిస్తున్నట్టు పేర్కొనడంతో ప్రాజెక్టు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కాని సీడబ్ల్యుసీ నుంచి అనుమతి లభిస్తుందని ప్రభుత్వం గట్టిగా విశ్వసించింది. ఆవిధంగా అనుమతులు రాగానే 2026 డిసెంబర్ నాటికి పెడిరగ్ పనులు, చెల్లింపులు అన్నీ పూర్తిచేసి ప్రాజెక్టును వినియోగంలోకి తీసుకురావాలని రేవంత్ ప్రభుత్వం కృతనిశ్చయంతో వుంది. ప్రస్తుతం సీడబ్ల్యుసీ లేఖ, ప్రభుత్వం ఆశలపై పూర్తిగా నీళ్లు చల్లిచనట్లయింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి 45.66 టీఎంసీ నీటిని కృష్ణానదిపై ని ర్మించిన వివిధ చిన్న ప్రాజెక్టుల ద్వారా పొదుపుచేసి, ఆ నీటిని పీఆర్‌ఎల్‌ఐఎస్ ప్రాజెక్టుకు విని యోగించే అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం విస్మరించిందని సీడబ్ల్యుసీ పేర్కొంది. దీనికి సంబంధించి నిర్దేశిత ఫార్మాట్‌లో వివరాలు కావాలని ప్రభుత్వాన్ని గత ఏప్రిల్‌లో కోరినా ఇప్పటివరకు ప్ర భుత్వం నుంచి ఎటువంటి వివరాలు అందలేదని సీడబ్ల్యుసీ పేర్కొంది. నిజానికి పీఆర్‌ఎల్‌ఐఎస్ ప్రాజెక్టుకు సంబంధించిన తెలంగాణ ప్రభుత్వం పెట్టిన దరఖాస్తు 2022 సెప్టెంబర్ నెలనుంచి సీడబ్ల్యుసీ వద్ద పెండిరగ్‌లో వుంది. మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులద్వారా పొదుపుచేసిన 45 టీఎంసీజలాలను వినియోగిస్తామని మరో 45 టీఎంసీ జలాలను కృష్ణానదికి మళ్లించే గోదావరి జలాల్లోవాడుకుంటామని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది.
అయితే సీడబ్ల్యుసీ చెప్పేదేమంటే పోలవరం ప్రాజెక్టునుంచి కృష్ణానదికి తరలించే 80 టీఎంసీ జలాల్లో 45 టీఎంసీల నీటిని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. అయితే ఈ 45 టీఎంసీల జలాలు మొత్తం తమకే కావాలని రెండు తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు జగడమాడుతున్నా యి. ఇప్పుడు ఈ 45 టీఎంసీల జలాల వినియోగంపై రెండు రాష్ట్రాల మధ్య ఎటువంటి అంగీ కారం లేని నేపథ్యంలో, దీనికి సంబంధించి ఒక అగ్రిమెంట్ కాపీని కూడా ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం సమర్పించాలని సీడబ్ల్యుసీ కోరుతోంది. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 811టీఎంసీల కృష్ణా జలాల పంపిణీ విషయంలో ఆంధ్ర`తెలంగాణ రా ష్ట్రాలు ఎవరికి వారు భీష్మించుకొని తమ వాదనకే కట్టుబడి వుండటంలో సమస్య ఎటూ తెగ డం లేదు. ప్రస్తుతం ఈ వివాదం కృష్ణా నదీ జలాల ట్రిబ్యునల్ విచారణలో వుంది. ఈ సమస్య పరిష్కారం కానంతవరకు తానేం చేయలేనని సీడబ్ల్యుసీ చేతులెత్తేసింది. దీంతో పాలమూరు`రంగారెడ్డి ఎత్తిపోతల ప థకం పెండిరగ్‌లో పడిరది. దీన్ని రేవంత్ ప్రభుత్వం ఏవిధంగా పరిష్కరిస్తుందో చూడాలి.