ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:
ఓదెల మండలంలోని పొత్కపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన శనిగరపు కుమార్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో షార్ట్ సర్క్యూట్ కావడంతో టీవీ, ఫ్రిడ్జ్, టేబుల్ కూలర్ తదితర వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారుగా రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని కోరుతున్నారు.