
మహబూబ్ నగర్/నేటి ధాత్రి
మహబూబ్ నగర్ పట్టణం పద్మావతి కాలనీలోని ప్రభుత్వ ఎస్సీ డి.డి హాస్టల్, ఆనంద నిలయం హాస్టల్స్ ను మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హస్టల్ పరిసరాలను ఎమ్మెల్యే పరిశీలించారు. వార్డెన్లు శివ కుమార్, తిరుపతయ్యలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్స్ ప్రాంగణంలో కావాల్సిన అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తాను కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం హాస్టల్ విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో టి.పిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.